వీళ్ల స్క్రీన్ ప్రెజెన్స్ కే గూస్ బంప్స్ వస్తున్నాయి

సైరా సినిమా రిలీజ్ సమయం దగ్గర పడుతూ ఉండడంతో చిత్ర యూనిట్ ప్రొమోషన్స్ స్పీడ్ పెంచింది, ఇదే జోష్ లో సైరా టైటిల్ సాంగ్ ఫుల్ వీడియోని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. రిలీజ్ కి ముందే ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేయడం చాలా అరుదు, అలాంటిది సైరా మేకర్స్ మాత్రం తమ సినిమా స్థాయి చూపించడానికే వీడియో సాంగ్ ని రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. టైటిల్ సాంగ్ లో చూపించిన విజువల్స్, వాడిన కలర్ ప్యాట్రన్ చాలా రిచ్ గా ఉంది. ఎత్నిక్ వేర్ లో తమన్నా, నయనతార బ్యూటీఫుల్ గా ఉన్నారు. ముఖ్యంగా తమన్నా చాలా పవర్ఫుల్ గా కనిపించింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కీర్తి గురించి పొగుడుతూ డిజైన్ చేసిన ఈ సాంగ్ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది.

ఓ సైరా అంటూ మొదలైన పాటలో నింగి శిరస్సు వంచి నీకు నమస్కారం చేస్తుంది అనే లిరిక్, దాని ఫాలో చేస్తూ వచ్చిన విజువల్ స్టన్నింగ్ గా ఉంది. ఇక భార్యగా నటిస్తున్న నయనతార అందుకున్న లిరిక్స్ అందుకున్న తర్వాత సైరా సాంగ్ పీక్ స్టేజ్ కి వెళ్లింది. నయన్, తమన్నా కలిసి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గొప్పదనం చెప్పే సమయంలో ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూస్తే వాళ్ల స్క్రీన్ ప్రెజెన్స్ కే గూస్ బంప్స్ వచ్చేలా ఉంది. మొత్తానికి సైరా టైటిల్ సాంగ్ లో సౌండ్ మిక్స్ టాప్ నాచ్ లో ఉంది. ఓ సైరా అంటూ హమ్మింగ్ దానికి ప్యాడ్డింగ్ గా వచ్చిన మ్యూజిక్, సాంగ్ లో అక్కడక్కడా వచ్చిన యాక్షన్ సీన్స్ మెస్మరైజ్ చేస్తున్నాయి.

ఓ సైరా పాటలో గమనించాల్సిన ఇంకో విషయం సాంగ్ మధ్యలో నిహారిక కనిపించడం, పెళ్లి కూతురి గెటప్ లో నిహారిక కనిపిస్తుంది. ట్రైలర్ లో అక్కడక్కడా వారియర్ గా కనిపించిన నిహారికకి యుద్ధానికన్నా ముందు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దగ్గరుండి పెళ్లి చేశాడు. ఆమె భర్తని బ్రిటిషర్లు చంపాకే నిహారిక తిరుగుబాటు మొదలు పెట్టినట్లు ఉంది. అలాగే ట్రైలర్ లో లక్ష్మీ అనే నా పేరు చివర నరసింహారెడ్డి అనే మీ పేరుని కానుకగా ఇవ్వండి అని అడిగిన తమన్నా, ఓ సైరా సాంగ్ లో ఒక సీన్ లో చైన్ మేడలో వేసుకుంటూ కనిపిస్తుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తాళి కట్టకపోవడంతో, ఆయన పులి గోరుని తమన్నా మేడలో వేసుకోని అలానే ఉండిపోయింది. ఒక గొప్ప ప్రేమకథగా లక్ష్మీ పాత్ర మిగిలిపోయేలా ఉంది.

ఇదిలా ఉంటే సురేందర్ రెడ్డి సైరా సినిమా అన్ని భాషల్లో డిటిఎస్ మిక్స్ అయిపోయిన సందర్బంగా ప్రముఖ డిటిఎస్ మిక్సర్ తపస్ నాయక్ తో కలిసి దిగిన ఫోటో ను సోషల్ మీడియా లో షేర్ చేశాడు. ఆ ఫోటో వెనకాల వున్న స్క్రీన్ లోనే సైరా ఇంటర్వెల్ సీన్ వుంది. ఆసీన్ లో ఎతైన కొండలపై కూర్చొని చిరంజీవి ధాన్యం చేస్తుండగా కింద వార్ బిగిన్స్ నౌ అని టైటిల్ కార్డ్ వుంది. దాన్ని బట్టి చూస్తే అక్కడే ఇంటర్వెల్ కార్డు పడనుందని అర్ధమవుతుంది. ఈ ఫోటో చూసిన వాళ్లు సురేందర్ రెడ్డి సైరా ఇంటర్వెల్ సీన్ ని హింట్ ఇచ్చేశాడు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఎన్ని హింట్లు ఇచ్చినా ఆన్ స్క్రీన్ ఆ సీన్ వచ్చే సమయంలో థియేటర్స్ లో విజిల్స్ పడడం మాత్రం ఖాయం.