“నువ్వు తోపు రా” మూవీ రిలీజ్ డేట్

Nuvvu Thopu Raa Release Date Locked
Nuvvu Thopu Raa Release Date Locked

సుధాక‌ర్ కోమాకుల హీరోగా.. బేబి జాహ్న‌వి స‌మ‌ర్ప‌ణ‌లో యునైటడ్ ఫిలింస్ బ్యాన‌ర్‌పై ఎస్‌.జె.కె.ప్రొడక్ష‌న్స్ (యు.ఎస్‌.ఎ) వారి స‌హ‌కారంతో హ‌రినాథ్ బాబు.బి ద‌ర్శ‌క‌త్వంలో డి.శ్రీకాంత్ నిర్మిస్తున్న చిత్రం `నువ్వు తోపురా`. ఈ చిత్రం ఏప్రిల్ 26న‌ గీతా షిలిమ్ డిస్ట్రిబ్యూట‌ర్స్ ద్వారా విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా…

నిర్మాత శ్రీకాంత్ మాట్లాడ‌తుతూ – “మా చిత్రం గీతా ఫిలింస‌, జి 3 ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూట‌ర్ ద్వారా విడుద‌ల అవుతుండం మాకు ఆనందంగా ఉంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌26న గీతా ఆర్ట్స్ ద్వారా విడుద‌ల కావ‌డం ఆనందంగా ఉంది. అర‌వింద్‌గారికి, బ‌న్ని వాసుగారికి కృత‌జ్ఞ‌త‌లు“ అన్నారు.

స‌హ నిర్మాత డా.జేమ్స్ వాట్ కొమ్ము(యు.ఎస్‌.ఎ) మాట్లాడుతూ : మంచి నిర్మాణ విలువ‌ల‌తో అమెరికాలోన అత్యంత అంద‌మైన ప్ర‌దేశ‌మైన సాల్ట్ లేక్ సిటీ, ప్రొవో, త‌దిత‌ర ప్రాంతాల్లో షూటింగ్ జురుపుకున్న చిత్ర‌మిది“ అన్నారు.

ద‌ర్శ‌కుడు బి.హ‌రినాథ్ మాట్లాడుతూ – “మాస్‌, థ్రిల్ల‌ర్ కంటెంట్‌, అన్ని వర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది“ అన్నారు.

సుధాక‌ర్ కోమాకుల‌, నిత్యాశెట్టి, నిరోషా, ర‌వివ‌ర్మ‌, శ్రీధ‌ర‌న్‌, దివ్యా రెడ్డి, జెమిని సురేష్‌, దువ్వాసి మోహ‌న్‌, ఫిష్ వెంకట్‌, కల్ప‌ల‌త‌, ప‌ద్మ‌జ‌, జ‌బ‌ర్ ద‌స్త్ రాకేష్‌, మ‌హేష్ విట్టా, సిండీ పెరెజ్‌, జ్యారెడ్ బ్రాస‌న్‌, డౌసీ పియెద్రా, అన‌నోఖ్‌, శ్రీని కొల్ల‌, దీప‌క్ రావెళ్ల‌, రాజ్ ఆనందేసి, క్లేర్ బ్రౌన్‌, ఎడ్మండ్ రోజ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, డైరెక్ష‌న్‌: హ‌రినాథ్ బాబు, నిర్మాత‌: డి.శ్రీకాంత్‌, కో ప్రొడ్యూస‌ర్‌: డా.జేమ్స్ వాట్ కొమ్ము, అసోసియేట్ ప్రొడ్యూస‌ర్‌: రితేష్ కుమార్‌, స్టంట్స్‌: విజ‌య్ మాస్ట‌ర్‌, డుయ్ బెక్, కెమెరా: ప్ర‌శాష్ వేళాయుధ‌న్‌, వెంక‌ట్ సి.దిలీప్‌, ఆర్ట్‌: జెక్ జంజ‌ర్‌, ఎడిట‌ర్ ః ఎస్.బి ఉద్ధ‌వ్‌, సంగీతం: సురేష్ బొబ్బ‌లి, ఆమెరికా లైన్ ప్రొడ్యూస‌ర్‌: స్టెపెనీ ఒల్ల‌ర్ట‌న్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ర‌వివ‌ర్మ దంతులూరి.