లండన్ లో ఘనంగా ఎన్టీఆర్ వజ్రోత్సవం, నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు

తెలుగుదేశం పార్టీ స్థాపకుడు, మహానేత, తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. జీవం ఉట్టిపడేలా అలంకరించిన తారక రాముని చిత్రాలతో, ఆ మహానీయుని జీవిత విశేషాలతో కూడిన చిత్రపటాలతో, చిన్నారులు, మహిళలు, అభిమానుల కేరింతల నడుమ, పసుపు మయంగా అలంకరించబడిన వేదిక మీద, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు అంటూ రాష్ట్ర గీతాన్ని ఆలపించి, మేరు నగధీరుడైన తారక రాముని విగ్రహ ఆవిష్కరణ, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాలతో వేడుకలు ఆరంభమయ్యాయి.

పహల్గాం తీవ్రవాదుల దాడిలో అమరులైన వీరులకి సంతాప తీర్మానంతో పాటు పాకిస్థాన్ తీవ్రవాదుల మీద వీరోచిత పోరాటం జరిపిన భారత సైనికులకు & దేశ ప్రధాని నరేంద్రమోడీ చూపిన సమర్ధ నాయకత్వానికి అభినందన తీర్మానం చేశారు.

ఎన్టీఆర్ గారి సేవలను స్మరించుకుంటూ, ఆయన తెచ్చిన సంక్షేమ విధానాలను నేటి తరానికి పరిచయం చేస్తూ, ఆయన చూపించిన దారిలో తెలుగు వారి సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పార్టీని ముందుకు నడిపించే సంకల్పాన్ని పునరుద్ఘాటించారు.

అన్నగారు ఇచ్చిన ఆత్మగౌరవంకి చంద్రన్న నింపిన ఆత్మవిశ్వాసంతో తెలుగుజాతి ప్రపంచవ్యాప్తంగా అన్నిరంగాల్లో దూసుకుపోతుందని… ఆధునిక AI & QUANTUM యుగంలో తెలుగువాళ్లు మరిన్ని అవకాశాలని అందిపుచ్చుకుని విశ్వవిజేతలుగా నిలవాలనే బాబు గారి సంకల్పానికి అనుగుణంగా ప్రతి NRI ఎదిగేలా కష్టపడదామని ప్రతినిధులు తమ ప్రసంగాల్లో ప్రతిధ్వనించారు

మనందరి అభిమాన సినీనటుడు, హిందూపురం హ్యట్రిక్ ఎమ్మెల్యే, శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ పురస్కారం వరించిన ఆనంద తరుణంలో, 50 వసంతాల సినీ ప్రయాణ స్వర్ణోత్సవ సంవత్సర సందర్భంగా అభిమానులు జై బాలయ్య అంటూ ఆనందంతో కేరింతలు కొడుతూ ఆనందంతో శుభాకాంక్షలు తెలియచేస్తూ కేన్సర్ ఆసుపత్రి ద్వారా లక్షలాది పేద చిన్నారులకి ఆయన కొత్త జీవిటంతం ప్రసాదిస్తున్నారని తమ వంతుగా తాము సైతం ఈ ఉద్యమంలో పాల్గొంటామని ఆనందం వ్యక్తం చేశారు.

యువగళం పాదయాత్రతో పార్టీకి పునరుత్తేజం తెచ్చిన నారా లోకేష్ నాయకత్వంలో కార్యకర్తల సంక్షేమం కోసం చేస్తున్న కృషికి మరియు రాష్ట్రంలో యువత భవిత కోసం రాష్ట్రానికి పెట్టుబడులని ఆకర్షించడంలో లోకేష్ గారు చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం.

పునఃప్రారంభం అయిన అమరావతి, పోలవరం నిర్మాణం, బాబు గారి సారధ్యంలో వేగం పుంజుకుని 2029 నాటికి ఒక రూపం సంతరించుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ రాజధాని కోసం భూములు త్యాగం చేయటమే కాకుండా గత సైకో ప్రభుత్వంలో అనేక పోరాటాలతో రాజధానిని సజీవంగా నిలిపినందుకు రైతులకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చీఫ్ విప్ మరియు వినుకొండ ఎమ్మెల్యే శ్రీ జి.వి. ఆంజనేయులు గారు ఆన్లైన్ ద్వారా హాజరై పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్తు కార్యాచరణపై విలువైన అభిప్రాయాలు పంచుకున్నారు.

ఈ సందర్భంగా తెలుగునాట మహానాడుకి వచ్చే కార్యకర్తలకి పసందైన విందు అనేది అన్నగారి నుంచి వస్తున్న సాంప్రదాయం అని దానిని UKలో సైతం కొనసాగిస్తూ ఏర్పాటు చేసిన విందు ఆహుతులకి మధురానుభూతిని పంచింది..

కార్యక్రమంలో చివరగా గత 18 ఏళ్లుగా UK NRI TDP తరపున కృషి చేస్తున్న సీనియర్ కార్యకర్తలని మహానాడు ఘనంగా సన్మానించి వారి మార్గనిర్దేశంలో మరింత ఉత్సాహంగా ముందుముందు పనిచేస్తామని తీర్మానించింది.

యూకే నలువైపుల నుంచి వచ్చిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో వేదిక కళకళలాడింది. ఈ కార్యక్రమం ఎన్‌ఆర్‌ఐ తెలుగుదేశం పార్టీ (టిడిపి) యూకే విభాగం, కార్యనిర్వహణ సభ్యుల ఆధ్వర్యంలో, లండన్ నగరంలో వైభవంగా నిర్వహించబడింది.