మెగా హీరో కోసం ముందుకొచ్చిన ఎన్టీఆర్

మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన అనే సినిమా రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా… లాక్‌డౌన్ వల్ల ఆలస్యమైంది. అయితే ఎట్టకేలకు ఫిబ్రవరి 12న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ఇటీవలే సినిమా యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ అయి యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవ్వడంతో.. సినిమాపై అంచనాలు పెరిగాయిన.

ntr release uppena trailer

బుచ్చిబాబు ఈ సినిమా దర్శకత్వం వహించగా.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌‌పై తెరకెక్కింది. సుకుమార్ దీనికి సహా నిర్మాతగా ఉన్నాడు. అయితే ఈ సినిమా ట్రైలర్‌ను త్వరలో విడుదల చేయనుండగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేయించబోతున్నారు.