‘నాట్యం’కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్

ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యరాజు ప్రధాన పాత్రలో నాట్యం పేరుతో ఒక సినిమా సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ఫిబ్రవరి 10న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ప్రకటించాడు.

NTR VOICE OVER FOR NATYAM MOVIE

అంతేకాకుండా ఈ సినిమాకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు. ఎన్టీఆర్ స్వయనా కూచిపూడి డ్యాన్సర్. చిన్నప్పడు స్టేజీలపై ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి బహుమతులు కూడా గెలుచుకున్నాడు. ఎన్టీఆర్ ఇప్పుడు బెస్ట్ డ్యాన్సర్ అవ్వడానికి కూచిపూడి నేర్చుకోవడం ఎంతో ఉపయోగపడింది. దీంతో నాట్యం సినిమాకు మద్దతు ఇవ్వాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నాడు. అందుకే ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడు. కాగా సత్యం కంప్యూటర్స్ సర్వీసెస్ ఫౌండర్ రామలింగరాజు కొడలే సంధ్యరాజు. నిశృంకల ఫిల్మ్స్ బ్యానర్‌పై రేవంత్ కోరుకోండ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.