హిందీలోకి ఎన్టీఆర్ మూవీ రీమేక్

తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాలు బాలీవుడ్‌లోకి రీమేక్ కావడం, అక్కడ విజయవంతమైన సినిమాలు తెలుగులోకి రీమేక్ కావడం కామనే. కానీ తెలుగులోకి అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోని ఒక సినిమా ఇప్పుడు హిందీలోకి రీమేక్ కావడం సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఆ సినిమా పేరే ఊసరవెల్లి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా 2011లో విడుదలైంది. ఇందులో తమన్నా హీరోయిన్‌గా నటించింది.

usaravelli hindhi

బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయిన ఈ సినిమాను ఇప్పుడు హిందీలోకి రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో ఈ సినిమా బెంగాలీలోకి రీమేక్ చేయగా.. అక్కడ కూడా ఆశించిన విజయం సాధింలేదు. ఇప్పుడు టీమ్స్ అనే సంస్థ హిందీలోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అక్షయ్ కుమార్ ఇందులో హీరోగా నటించనున్నాడట.

అయితే హిందీలో స్క్రీఫ్ట్‌లో కొన్ని మార్పులు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్క్రీఫ్ట్‌కి సంబంధించి పనులు జరుగుతున్నాయి. త్వరలోనే నటీనటీలను ఎంపిక చేయనున్నారు.