Trivikram: ఎన్టీఆర్‌ను ఢీకొట్ట‌నున్న విజ‌య్‌సేతుప‌తి..

Trivikram: యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్‌సేతుప‌తి కాంబోలో ఓ చిత్రం రూపొందుతుంద‌ని వార్తాలు వెలువ‌డుతున్నాయి. వీరి కాంబోను డైరెక్ట‌ర్ మాట‌ల మాంత్రికుడు Trivikramత్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడ‌ట‌.. ఇలా ఫిలింన‌గ‌ర్‌లో ఈ విష‌యం చ‌క్క‌ర్లు కొడుతుంది. వివ‌రాల్లొకి వెళితే.. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ద‌ర్శ‌క దిగ్గ‌జ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా ప్ర‌స్తుతం క్లైమాక్స్ ద‌శ‌లో ఉంద‌ని చిత్ర‌బృందం ఇటీవ‌లే అధికారికంగా తెలిపింది.

ntr updtes

ఇక ఈ సినిమా అనంత‌రం ఎన్టీఆర్ Trivikramత్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్నాడు. అయితే ఈ సినిమాలో విల‌న్‌పాత్ర కోసం విజ‌య్‌సేతుప‌తిని తీసుకున్నార‌ని వార్తాలు వ‌స్తున్నాయి. ఈ మ‌ధ్య‌కాలంలో విల‌న్‌పాత్ర‌ల‌కు కేరాఫ్‌గా నిలుస్తూ అల‌రిస్తున్న మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్‌సేతుప‌తి.. ఇప్ప‌డు ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ను ఢీకొట్ట‌బోతున్నాడ‌ని వార్తాలు వెలువ‌డుతున్నాయి. ఈ క‌థ‌లో భాగంగానే ఎన్టీఆర్‌కు ధీటుగా ఎదుర్కొనే విల‌న్‌గా ఇప్పుడున్న న‌టుల్లో విజ‌య్‌సేతుప‌తి స‌రిగ్గా స‌రిపోతార‌నేది అనిపిస్తుంది. కానీ ఈ విష‌యంపై Trivikramచిత్ర‌బృందం నుంచి ఎటువంటి స‌మాచారం రాలేదు. ఇక విజ‌య్‌సేతుప‌తి విల‌న్‌గా న‌టించిన తాజా చిత్రాలు మాస్ట‌ర్‌, ఉప్పెన చిత్రాలు భారీ బ్లాక్‌బ‌స్ట‌ర్ అయ్యాయి.