NTR: ఎన్టీఆర్‌-త్రివిక్ర‌మ్ మూవీ షురు!

NTR: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజ‌గా ఉన్నాడు. ఈ చిత్రం ప్ర‌స్తుం క్లైమాక్స్ ద‌శ‌లో ఉందని ఇటీవ‌లే ఈ చిత్రబృందం ప్ర‌క‌టించింది. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌క దిగ్గ‌జ రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తుండ‌గా.. ఇందులో మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ NTRకొమురం భీంగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక ఈ చిత్రం అనంత‌రం NTRఎన్టీఆర్.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో ఓ చిత్రంలో న‌టించ‌నున్నాడు.

Trivikram-ntr Movie

ఈ చిత్రానికి సంబంధించి స‌రికొత్త అప్‌డేట్ ఫిలింన‌గ‌ర్లో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తుండ‌గా.. ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ప్ర‌స్తుతం ముమ్మ‌రంగా జ‌రుగుతున్నాయి. ఈ చిత్ర షూటింగ్‌ను మే నెలాఖ‌రులో ప్రారంభించి ఏక‌ధాటిగా నిర్వ‌హించేలా ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని స‌మాచారం. ఇక ఈ సినిమాలో విల‌న్ పాత్ర‌కోసం కోలీవుడ్ స్టార్ మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తిని అడుగుతున్నార‌ని స‌మాచారం. ఇదిలా ఉంచితే NTRఎన్టీఆర్‌- రాంచ‌ర‌ణ్ న‌టిస్తోన్న ఆర్ఆర్ఆర్ చిత్రం ద‌స‌రా కానుక‌గా ఆక్టోబ‌ర్ 13న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు ‌చిత్రబృందం అధికారికంగా ప్ర‌క‌టించింది.