పాన్ ఇండియాని టార్గెట్ చేస్తున్నాడు

బ్యాక్ టు బ్యాక్ అయిదు హిట్స్ ఇచ్చిన టాలీవుడ్ టాప్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆర్.ఆర్.ఆర్ తర్వాత చేసే సినిమా ఏంటి అంటే చాంతాడంత లిస్ట్ కనిపిస్తోంది. ఒక్కసారి తారక్ ఫ్యూచర్ మూవీస్ లైన్ అప్ చూస్తే, అశ్వినీ దత్ బ్యానర్ లో కోలీవుడ్ సెన్సేషనల్ డైరక్టర్ అట్లీతో తారక్ సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడో రావాల్సి ఉన్నా, ఎందుకో రాలేదు. ఈ కాంబినేషన్ సెట్ అయితే ఎన్టీఆర్ కి కోలీవుడ్ లో మంచి మార్కెట్ ఏర్పడుతుందని నందమూరి అభిమానులంతా ఆశించారు. ఇది మెటీరియలైజ్ అవలేదు. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ఏంటంటే, ఎన్టీఆర్ అట్లీ లైన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.

అట్లీ ప్రాజెక్ట్ డిస్కషన్స్ లో ఉండగానే తారక్ మళ్లీ త్రివికమ్ తో సినిమా చేస్తాడని, దానికి కళ్యాణ్ రామ్ కో ప్రొడ్యూసర్ గా ఉంటాడని మరో వార్త సోషల్ మీడియాలో ఉంది. ఇప్పటికే ఈ కలయికలో అరవింద సమేత సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుత బన్నీతో అల వైకుంఠపురములో సినిమా చేస్తున్న త్రివిక్రమ్ అది అయిపోగానే, ఎన్టీఆర్ కోసం కథని సిద్ధం చేసే పనిలో పడతాడని సమాచారం. అట్లీ, త్రివిక్రమ్ తర్వాత తారక్ లైన్ అప్ లో వినిపిస్తున్న మరో ఇద్దరు డైరెక్టర్స్ కొరటాల శివ, ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ కి మంచి సన్నిహితుడైన కొరటాల శివ, చిరు మూవీ కంప్లీట్ కాగానే తారక్ తో సినిమా చేస్తాడని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఇక ప్రశాంత్ నీల్ విషయానికి వస్తే, కేజీఎఫ్ సినిమా తర్వాత నేషనల్ ఫేమ్ తెచ్చుకున్న ఈ కన్నడ డైరెక్టర్ ఎన్టీఆర్ తో మూవీ చేస్తాడని ఏకంగా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. ప్రశాంత్ నీల్, ఈ ఇద్దరు హీరోల్లో ఎవరితో సినిమా చేస్తాడో తెలియదు కానీ… తారక్ మాత్రం ఎవరితో చేసినా సౌత్ లో పాగా వేసే కథతోనే ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు.