ఎన్టీఆర్ షూ ఖరీదెంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

స్ట్రైలిష్‌గా కనిపించేందుకు సినిమా సెలబ్రెటీలు పాపులర్ బ్రాండెట్, అత్యధిక రేటు గల దుస్తులు, వాచ్‌లు, షూస్‌లను వాడుతూ ఉంటారు. దీంతో సెలబ్రెటీలు ధరించే వస్తువుల గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూ ఉంటుంది. సెలబ్రెటీల ధరించే వస్తువుల రేటు గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇప్పుడు ఎన్టీఆర్ షూస్ గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. దాని రేటు గురించి తెలుసుకుని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

NTR SHOES RATE

గత కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ దర్శనమించిన వీడియో ఒకటి సోషల్ వీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ వీడియోలో ఎన్టీఆర్ ధరించిన షూస్ చాలా స్ట్రైలిష్‌గా ఉన్నాయి. ఈ షూస్ HERMES కంపెనీకి చెందినవి. ఈ షూస్ ఖరీదు రూ.75 వేలు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇది తెలుసుకుని ఎన్టీఆర్ ఇంత ఖరీదైన షూస్ వాడుతున్నారా? అంటూ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాలో తారక్ నటిస్తున్నాడు. ఇటీవలే ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన కొమురం భీం టీజర్ విడుదల అవ్వగా.. ఇది యూట్యూబ్‌ను షేక్ చేసింది. దీనికి రాంచరణ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు.