
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న ‘డ్రాగన్’ సినిమా కోసం అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఊపందుకున్న వేళ, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తమ కుటుంబాలతో కలిసి సరదాగా గడిపిన క్షణాల ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
‘డ్రాగన్’ సినిమా పూర్తి మాస్ యాక్షన్తో అభిమానుల అంచనాలను ఆకాశానికి తాకేలా చేసింది. ఇటీవల షూటింగ్లో చేరిన ఎన్టీఆర్, భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తూ బిజీగా ఉన్నారు. షూటింగ్కు బ్రేక్ దొరికిన సమయంలో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తమ భార్యలతో కలిసి ఫ్యామిలీ టైమ్ను ఆస్వాదిస్తున్నారు. ఈ సందర్భంగా వారు సరదాగా గడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘డ్రాగన్’ టీమ్ ఈ చిత్రాలను షేర్ చేయడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, సినిమాకు సంబంధించిన అధికారిక అప్డేట్స్ను కూడా త్వరగా ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు.