ఎన్టీఆర్ తర్వాతి సినిమా ఎవరితో తెలుసా?

ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘RRR’ సినిమాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తుండగా.. దీని తర్వాత చేయబోమే సినిమా కూడా ఖరారు అయింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ తన తర్వాతి సినిమా చేయనున్నాడు. ఎన్టీఆర్‌తో బదులు తన తర్వాతి సినిమాను హీరో రామ్‌తో త్రివిక్రమ్ చేయనున్నాడని మీడియాలో వార్తలు వచ్చాయి.

NTR

ఎన్టీఆర్ కూడా ‘RRR’ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడని వార్తలొచ్చాయి. అయితే ఇవన్నీ అవాస్తవాలని తేలిపోయింది. ఇవాళ త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా ఆయనకు బర్త్ డే శుభాకాంక్షలు చెబుతు ఎన్టీఆర్ ఆర్ట్స్ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. దీంతో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాపై వచ్చిన వార్తలు అవాస్తవాలేనని తేలింది.

RRR సినిమా పూర్తైన తర్వాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా తెరకెక్కనుందని సమాచారం. RRR సినిమా పూర్తికాకముందే త్రివిక్రమ్ సినిమాపై వర్కౌట్ చేసేందుకు తారక్ సిద్ధం లేదట.