ఎన్టీఆర్ ని ఇంత స్టైలిష్ గా ఎప్పుడూ చూసి ఉండరు…

దర్శక ధీరుడు జక్కన్న చెక్కుతున్న లేటెస్ట్ సినిమా ఆర్ ఆర్ ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే ఇండియా వైడ్ హ్యూజ్ హైప్ వచ్చింది. తారక్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీత రామరాజు పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యి, రీసెంట్ గా బల్గెరియా షెడ్యూల్ కూడా పూర్తి చేసుకోని వచ్చాడు. ఇక సైరా పనుల్లో బిజీగా ఉన్న చరణ్ కూడా ఫ్రీ అయ్యాడు కాబట్టి చెర్రీ త్వరలోనే ట్రిపుల్ ఆర్ సెట్స్ లో జాయిన్ అవ్వనున్నాడు. అయితే ఈ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో చరణ్, ఎన్టీఆర్ ఎలా ఉంటారు అనే విషయంలో అభిమానులు ఎవరికి వారు ఫ్యాన్ మేడ్ ఎడిట్స్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.

ఈ ఫ్యాన్ మేడ్ ఎడిట్స్ చూసి సంతోష పడుతున్న నందమూరి ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ కొత్త లుక్ బయటికి వచ్చి షాక్ ఇస్తోంది. ఒట్టో బట్టల బ్రాండ్ కి ఎన్టీఆర్ అంబాసిడర్ కావడంతో, తారక్ నటించిన ఒక యాడ్ బయటకి వచ్చింది. ప్రసన్న బెజవాడ డైలాగులు రాసిన ఈ ప్రోమోలో ఎన్టీఆర్ కొత్త లుక్‌లో కనిపించాడు. బాగా సన్నబడి స్లిమ్‌గా మారిన ఎన్టీఆర్, కొమరం భీమ్ పాత్రలో ఫుల్ ఫిట్ గా కనిపించనున్నాడని అర్ధమవుతుంది.