అక్కడ ఈ ఇద్దరికే పోటీ… టాప్ 5లో మహేశ్ 2, ఎన్టీఆర్ 3

సోషల్ మీడియాలో అభిమానులు చేసే సందడి మాములుగా ఉండదు, తమ హీరోకి సంబంధించి ఏ విశేషం వచ్చినా దాన్ని ట్రెండ్ చేస్తూ ఫ్యాన్స్ వారి అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. ఈ కోవలోనే రీసెంట్ గా జరిగిన విశేషం, అరవింద సమేత వన్ ఇయర్ పూర్తి చేసుకోవడం. నందమూరి అభిమానులకి చాలా స్పెషల్ సినిమా అయిన అరవింద సమేత వీర రాఘవ రిలీజ్ అయ్యి ఏడాది దాటింది. దీంతో ఎన్టీఆర్ ఫాన్స్ యానివర్సరీ ట్రెండ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేశారు. నేషనల్ వైడ్ ట్రెండ్ అయిన ఈ ట్యాగ్ తో 24 గంటల్లో 5 లక్షల 30 వేల ట్వీట్స్ దగ్గర కి వచ్చి ఆగింది. ఇది రీసెంట్ టైం లో ఆల్ టైం సెకెండ్ బిగ్గెస్ట్ యానివర్సరీ ట్రెండ్ గా నిలిచింది. దీనికన్నా ముందు ఫస్ట్ ప్లేస్ లో దూకుడు విడుదలై 8 ఏళ్ళు అయిన సందర్భంగా సోషల్ మీడియా లో 676k ట్వీట్స్ వేసి ఘట్టమనేని అభిమానులు టాప్ ప్లేస్ లో ఉంచారు.

ntr mahesh

ఇక ఇప్పటి వరకు జరిగిన యానివర్సరీ ట్రెండ్ లో ఆల్ టైం టాప్ 5 ప్లేసులలో నిలిచిన ట్రెండ్ లను ఒకసారి గమనిస్తే
1) #8YrsForIHDookuduSensation – 676K
2) #1YearForVeeraRaghavaRage – 530K
3) #12YearsOfBBYamadonga – 353K
4) #4YearsForCultTEMPER – 325K
5) #7YearsForIHDookudu – 243K
ఈ అయిదులో మూడు ఎన్టీఆర్ వి కావడం, ఇది కూడా మూడు వేరు వేరు సినిమాలది కావడం విశేషం.