ఎన్‌టి‌ఆర్ మోసగాళ్లకు మోసగాడు చిత్రం గురించి కృష్ణకు రాసిన లేఖ

Mosagallaku Mosagadu
Mosagallaku Mosagadu

సోదరుడు, శ్రీ కృష్ణ తీసిన “మోసగాళ్లకు మోసగాడు ” చిత్రం చూశాను ఎంతో ప్రయాసకులోనై. ఒక విశిష్టమైన సాంకేతిక విలువలతో ఈ చిత్ర నిర్మాణం జరగాలన్న ధ్యేయం,పట్టుదల ప్రతి షాట్లోను, ప్రతి ఫ్రేమ్ లోనూ కన్పించింది. తెలుగు భాషలో చూస్తున్న ఇంగ్లిష్ చిత్రమా అనిపించింది.

ముఖ్యంగా ప్రశంసించదగినది ఛాయాగ్రహణము ఇంత వున్నత ప్రమాణాలతో కెమెరాను ఉపయోగించిన శ్రీ స్వామి అభినంధనీయుడు కథకు అనుగుణ్యమైన వేగంతో దర్శకత్వం నిర్వహించిన శ్రీ దాసు ప్రశంసా పాత్రుడు.

ఇంత సాంకేతిక విలువలతో జాతీయత, మన సంస్కృతి మన సాంగీక వాతావరణం ప్రతిబింబించే అభ్యుదయ భావ పూరితమైన మహత్కర కళాఖండాలను అభిమానులకు శ్రీ కృష్ణ అందించగలరని ఆశిస్తూ సాహసోపేతమైన యీ చిత్ర నిర్మాణ కృషికి అతన్ని అభినందిస్తునాను.
-నందమూరి రామారావు