ఎన్టీఆర్ ట్రాక్ లిస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే…

9 ఏళ్లకే ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసిన ఎన్టీఆర్, ఆ తర్వాత వరస ఫ్లాప్స్ తో టాప్ చైర్ కి కాస్త దూరం అయ్యాడు. 2015 నుంచి మళ్లీ స్పీడ్ పెంచిన ఎన్టీఆర్, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తూ డబుల్ హ్యాట్రిక్ కి దగ్గరలో ఉన్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో, రామ్ చరణ్ తో కలిసి ట్రిపుల్ ఆర్ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్, అది అయిపోగానే తన నెక్స్ట్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుంది అనే విషయంపై సోషల్ మీడియాలో చాలా చర్చలు జరుగుతున్నాయి. అందరూ అనుకున్నట్లు ఎన్టీఆర్ సెట్ చేసిన లైన్ అప్ వర్కౌట్ అయితే మాత్రం తారక్ బాక్సాఫీస్ ని చెడుగుడు ఆడేయడం ఖాయం. సో ఎన్టీఆర్ ఫ్యూచర్ మూవీస్ ట్రాక్ లిస్ట్ చూస్తే, ఆర్ ఆర్ ఆర్ అయిపోగానే… కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఒక ప్రాజెక్ట్ ని సెట్ చేసిన తారక్… 2020 ఎండింగ్ లో దాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

ప్రశాంత్ నీల్ సినిమా అయిపోగానే, ఎన్టీఆర్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో మూవీ చేయనున్నాడు. ఎప్పటి నుంచో చర్చల్లో ఉన్న సినిమా అశ్విని దత్ నిర్మాణంలో తెరకెక్కే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్టీఆర్ కి అట్లీ లైన్ కూడా చెప్పాడని, అతనికి ఉన్న కమిట్మెంట్స్ పూర్తి కాగానే తారక్ కోసం కంప్లీట్ కథని సిద్ధం చేస్తాడని సమాచారం. ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తికాగానే ఎన్టీఆర్-కొరటాలతో కలవనున్నాడు. ఇప్పటికే జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఈ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతోంది. ఈ మూడు ప్రాజెక్ట్స్ మాత్రమే కాకుండా తారక్-త్రివిక్రమ్ మూవీ కూడా లూప్ లైన్ లో ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఈ ప్రాజెక్ట్స్ సెట్స్ పైకి వెళ్ళడానికి టైం పడుతుంది కానీ… ఈ ట్రాక్ లిస్ట్ చూస్తే మాత్రం ఏ హీరోకైనా డ్రీం లైన్ అప్ లాంటిది. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో ఉన్న ఎన్టీఆర్… ఈ మూవీస్ లో రెండు హిట్ ఇచ్చినా కూడా సౌత్ ఇండియా అంతా తారక్ పేరు మోగిపోతుంది అనడంలో సందేహం లేదు.