మరో రికార్డు సృష్టించిన ఎన్టీఆర్

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘RRR’సినిమాలోని ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన భీమ్ ఫర్ రామరాజు టీజర్ యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది. తాజాగా 2 లక్షలకుపైగా కామెంట్లను దక్కించుకున్న టీజర్‌గా రికార్డు నమోదు చేసుకుంది. దీంతో తారక్ అభిమానులు దీనిని సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. గతంలో తెలుగులో ఏ సినిమాకు ఇన్ని కామెంట్లు రాలేదని చెబుతున్నారు. ఇప్పటివరకు ఈ టీజర్‌కు 32 లక్షల వ్యూస్ రాగా.. 11 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి.

NTR

ఈ టీజర్‌కు రాంచరణ్ వాయిస్ చెప్పగా… ఇందులో ఎన్టీఆర్ కొత్త లుక్‌లో కనిపించాడు. ఈ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం RRR షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుండగా.. వచ్చే ఏడాది సెకండాఫ్‌లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశముంది. అంతకుముందు విడుదలైన రాంచరణ్ సీతారామరాజు పాత్రకు సంబంధించిన టీజర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇందులో ఎన్టీఆర్ ఇచ్చిన వాయిస్ ఓవర్ హైలెట్‌గా నిలిచింది. ఈ రెండు టీజర్లతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన టీజర్లు రికార్డు సృషించడంతో.. ఇక సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.