ఎన్టీఆర్ ఎంట్రీకి 20 ఏళ్లు

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినీ అరగ్రేటం చేసి ఈ ఏడాదితో 20 ఏళ్లు అవుతోంది. దీంతో తారక్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. 20YEARS OF NTR అంటూ ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. అంతేకాకుండా కామన్ డీపీని సోషల్ మీడియాలో విడుదల చేశారు. కాయిన్ ఆకారంలో ఉన్న ఈ డీపీలో ఎన్టీఆర్ నటించిన అన్ని సినిమా పాత్రలను, సినిమాల్లో ఉపయోగించిన ఆయుధాలను పొందుపర్చారు. ఈ డీపీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

NTR 20 YEARS

2001లో విడుదలైన ‘నిన్ను చూడాలని ఉంది’ అనే సినిమాతో ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినా… అదే ఏడాది వచ్చిన ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమాతో తారక్ స్టార్ డమ్‌ను అందుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ‘ఆది’, సింహాద్రి, ‘యమదొంగ’ లాంటి సినిమాలతో టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎన్టీఆర్ గుర్తింపు పొందాడు.

ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘RRR’ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఇందులో రాంచరణ్‌తో కలిసి ఎన్టీఆర్ నటిస్తుండగా.. డీవీవీ దానయ్య ఈ సినిమాకు నిర్మిస్తున్నారు.