మే 28 నుండి జూన్ 3, 2023 వరకునార్త్ కరోలినాలో “తెలుగు వారసత్వ వారం గా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు

మే 28 నుండి జూన్ 3, 2023 వరకు
నార్త్ కరోలినాలో “తెలుగు వారసత్వ వారం గా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
• ప్రస్తుతం బ్రతికిఉన్న అతి ప్రసిద్ధి చెందిన పురాతన భాషలలో తెలుగు భాష ఒకటి. క్రీ.పూ 400 ఏళ్లనాటి తెలుగు శాసననలు తెలుగుభాష గొప్పతనం, సాహిత్యం, చరిత్రను గురించి తెలియజేస్తున్నాయి.
• భారతదేశ దక్షిణ-మధ్య ప్రాంతం నుండి వచ్చిన తెలుగు మాట్లాడే ప్రజలు ఉత్తర కరోలినా రాష్ట్రంతో సహా ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్నారు.
• ఉత్తర కరోలినా తెలుగు కమ్యూనిటీ భారతీయ వారసత్వం, సంస్కృతిని సంరక్షించడంలోను, సుసంపన్నం చేయడంలోను కీలక పాత్ర పోషిస్తోంది. అంతేకాకుండా, ఉత్తర కరోలినా వైవిధ్యం కాపాడటంలో తెలుగు కమ్యునిటీ ఎనలేని సేవ చేస్తోంది.
• ఉత్తర కరోలినా తెలుగు సంఘం వైద్యం, ఔషధాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, పరిశోధన, లా, వ్యాపారం, విద్యా లాంటి అనేక రంగాలలో గణనీయమైన కృషి చేస్తోంది.
• నార్త్ కరోలినా తెలుగు సంఘం క్యారీలో ఎత్తైన శ్రీ వేంకటేశ్వర ఆలయం నిర్మించడంలో నాయకత్వం వహించి కీలకపాత్ర పోషించింది.
• తెలుగు దిగ్గజం, సినీ నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అన్న ఎన్టీఆర్ సినిమాలు, రాజకీయాలు, తెలుగువారి సంస్కృతి, సాంప్రదాయాలపై చెరగని ముద్ర వేశారు. పంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే ప్రతీ ఒక్కరికీ ఎన్టీఆర్ ఒక ఐకనిక్ గా అవతరించారు.
• మే 28, 2023, ఎన్టీఆర్ జయంతి శతజయంతి రోజున తెలుగు వారికి ఆయన చేసిన బహుముఖ సేవలను గుర్తించి గౌరవించే అవకాశం కలగడం మన అదృష్టం.
• తెలుగువారి సంస్కృతిని, వారసత్వం, సాంప్రదాయలకు ఎనలేని సేవచేసిన ఎన్టీఆర్ స్మారకార్థం నార్త్ కరోలినా తెలుగు సంఘం జూన్ 3, 2023న సమావేశమవుతుంది.
• ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని నార్త్ కరోలినా రాష్ట్ర గవర్నర్, రాయ్ కూపర్, మే 28 నుంచి జూన్ 3, 2023 వరకు నార్త్ కరోలినాలో “తెలుగు వారసత్వ వారం”గా ప్రకటించారు. నార్త్ కరోలినా పౌరులు తెలుగు వారసత్వ వీక్ ను జరుపుకోవాల్సింది కోరారు.