ఎన్టీఆర్ అభిమానుల డౌట్ ఇప్పుడు తీరింది

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం RRR సినిమా చేస్తుండగా.. ఇది పూర్తైన తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయాల్సి ఉంది. కానీ ఈ సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో తారక్ అభిమానులు డైలమాలో పడిపోయారు. RRR తర్వాత ఎవరితో ఎన్టీఆర్ సినిమా చేస్తాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఎట్టకేలకు దీనిపై క్లారిటీ వచ్చింది.

NTR AND TRIVIKRAM
NTR AND TRIVIKRAM

ఇవాళ జూనియర్ ఎన్టీఆర్‌ను త్రివిక్రమ్ కలిశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అప్ కమింగ్ సినిమాకు సంబంధించిన విషయాలపై వీరిద్దరు చర్చించినట్లు సమాచారం. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కలిసి ఉన్న ఫొటోలను ట్విట్టర్‌లో నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ షేర్ చేసింది. న్యూ ఇయర్ ఎనర్జిటిక్ డే 2 అని కామెంట్ చేసింది.

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రానున్న సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. దీంతో ఈ ట్వీట్‌తో ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో సినిమా త్వరలోనే ప్రారంభం కానుందని క్లారిటీ వచ్చింది. ఎన్టీఆర్ 30వ సినిమాగా ఇది రానుండగా.. దీనికి ‘అయిననూ పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.