అప్డేట్స్ లేవమ్మా… అంతా కరోనా పుణ్యమే

ఏం కరోనానో ఏమో ఒక్క సినిమా లేదు షికారు లేదు ఆఫీస్ లేదు 24 గంటలు ఇంట్లో కూర్చోని నెత్తినోచ్చేలా ఉంది. ఎటు చూసినా నాలుగు గోడలు ముసుగు మనుషులు తప్ప మరో ప్రపంచం తెలుస్తలేదు. పోనీ ఇంట్లనే ఉండి, ఆ సినిమా వార్తలైనా చూద్దాం, అప్డేట్స్ వస్తాయి కదా అనుకుంటే వాటికీ కూడా ఈ కరోనా గాలి సోకి ఒక్క వార్త కూడా బయటకి వస్తలేదు.

సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు మే 31, ఆ రోజున మహేష్ బాబు సర్కారు వారి పాట నుంచి టీజరో పాటో ఎదో ఒకటి బయటకి వస్తదిలే… అసలే మహేశుని చూసి చాన్నాళ్ళయ్యింది అని సంబర పడుతుండే. ఈ కరోనా పుణ్యమాని అటు టీజర్ లేదు, ఇటు పాట లేదు. ఘట్టమనేని అభిమానులంతా ఎంత ఆశగా ఎదురు చూసిర్రో, అందరినీ ఆగం చేసిన కరోనా కృష్ణ గారి పుట్టిన రోజుకి సంబరాలే లేకుండా చేసే. చూస్తుంటే ఈ కరోనా కారణంగా మన జీవితం మరికొన్ని రోజులు ఉత్త మూకీ డ్రామా అయిపోయేట్టు ఉంది. సర్కారు వారి పాట నుంచి ఎలాంటి సప్పుడు లేదని తేలిపోయే, పోనీ మహేశ్ త్రివిక్రమ్ సినిమా వార్త అయినా ఉంటదో లేదో చూడాలే. అది కూడా లేకపోతే ఈ ఏడాది కృష్ణ గారి బర్త్ డే సప్పగా సాగినట్టే.