కరోనా వైరస్ కారణంగా థియేటర్స్ క్లోజ్ అవ్వడంతో రిలీజ్ కావాల్సిన సినిమాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ థియేటర్స్ ఓపెన్ అయినా కూడా గతంలో మాదిరిగా జనాలు థియేటర్స్ లోకి వస్తారా లేదా అనేది మరొక పెద్ద సమస్య. అయితే వచ్చిన OTT ఆఫర్స్ తోనే కొంతమంది సంతృప్తి చెందుతున్నారు. ఇక రవితేజ క్రాక్ సినిమా కూడా డిజిటల్ వరల్డ్ లోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది.
గతంలోనే ఒకసారి క్రాక్ నిర్మాతలు ఈ రూమర్స్ ని కొట్టిపారేశారు. ఇక ఇప్పుడు నాని V వినిమాతో పాటు మరికొన్ని మీడియం బడ్జెట్ సినిమాలు ఓటీటీలో వచ్చే ఛాన్స్ ఉన్నట్లు ఫిల్మ్ నగర్ లో రూమర్స్ వస్తున్నాయి. అలాగే ఇపుడు క్రాక్ సినిమా నిర్మాతలు ఓటీటీ డీలింగ్స్ పై చర్చలు జరుపుతున్నట్లు మరికొన్ని రూమర్స్ రాగా చిత్ర దర్శకుడు గోపిచంద్ మలినేని ఫైనల్ క్లారిటీ ఇచ్చాడు. క్రాక్ థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుందని ఒక్క మటలోనే వివరణ ఇవ్వడంతో సినిమా ఓటీటీ లో రానున్నట్లు వస్తున్న రూమర్స్ కి మొత్తానికి బ్రేక్ పడింది.