నివేద… డాటర్ ఆఫ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆదిత్య అరుణాచలం

నాని జెంటిల్ మ్యాన్ సినిమాతో తెలుగు తెరపై మెరిసిన బ్యూటీ నివేద థామస్. కథకి, తనకి క్యారెక్టర్ కి ఎంతో ఇంపార్టెన్స్ ఉంటేనే సినిమా ఓకే చేసే నివేద, ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తోంది. తెలుగులో నిఖిల్ పక్కన శ్వాస సినిమా చేస్తున్న నివేద, తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో నటిస్తోంది. మురుగదాస్ తెరకెక్కిస్తున్న దర్బార్ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఇదే మూవీలో నివేద థామస్ ఒక ఇంపార్టెంట్ రోల్ లో కనిపించనుంది. అయితే ఇప్పటి వరకూ ఈ సినిమా గురించి ఎక్కడా మాట్లాడని నివేద, దర్బార్ గురించి ఒక ట్వీట్ చేసింది.

ఈ ప్రపంచానికి ఓ విషయం తెలియాలి. ఇక్కడ ఒకేఒక్క ఆదిత్యా ఆరుణాచలం ఒక్కరే ఉన్నారు. అతనే మా నాన్న” అని నివేదా ట్వీట్‌ చేసింది. దీంతో రజినీకాంత్ దర్బార్ సినిమాలో ఆదిత్య అరుణాచలంగా కనిపించనున్నాడని తలైవా ఫ్యాన్స్ డిసైడ్ అయిపోయారు. సోలో హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న సమయంలో, రజినీ పక్కన నటించే అవకాశం రావడం, కథలో కూడా విషయం ఉండడంతో నివేద థామస్ దర్బార్ సినిమాలో తలైవా కూతురిగా కనిపించడానికి ఒప్పుకుంది. అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకి రానుంది.