తన భర్త పిల్లల గురించి మీడియా ముందు బయటపెట్టిన నివేదా థామస్

మలయాళ హీరోయిన్ నివేదా థామస్ తెలుగు వారికి పరిచయం అవసరం లేని పేరు.నిన్ను కోరి, వి, జెంటిల్మెన్, జై లవకుశ, వకీల్ సాబ్ వంటి సినిమాలలో నటించి విజయాలు సాధించిన నివేద థామస్ కొంచెం గ్యాప్ తర్వాత ఇప్పుడు మరోసారి తెలుగు సినిమాలలో నటిస్తున్నారు. దగ్గుబాటి రానా సమర్పిస్తున్న ’35 – చిన్న కథ కాదు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నివేద థామస్. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి రెండు లంచ్ హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోస్ లో హీరో దగ్గుబాటి రానా చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. అయితే ఆ ఈవెంట్లో సినిమా టీం వారు మీడియా వారితో మాట్లాడుతూ ఉండగా విజయవాడ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ నివేద థామస్ “అవును నాకు పెళ్లయింది ఇతనే నా భర్త, వెళ్లిన ఇద్దరు పిల్లలు, ఈ సినిమా వరకు” అన్నారు. నివేద థామస్ కొన్ని రోజుల క్రితం తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చూసి మీడియా వారు ఈ ప్రశ్న అడగడంతో ఆమె నవ్వుతూ ఈ విధంగా సమాధానం ఇచ్చారు.