నితిన్ ‘చెక్’ వచ్చేస్తోంది

లాక్‌డౌన్‌కు ముందు భీష్మ సినిమాతో హిట్‌ను అందుకున్న హీరో నితిన్.. ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఒకటి రంగ్ దే కాగా.. మరొకటి చెక్. ఈ రెండు సినిమాల షూటింగ్‌లు ఇప్పటికే పూర్తయ్యాయి. రంగ్ దే ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా.. లాక్‌డౌన్ వల్ల వాయిదా పడింది. అయితే ఇప్పుడు థియేటర్లలో ఆక్యుపెన్సీని పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. సినిమాల రిలీజ్ డేట్లను మేకర్స్ వరుసగా ప్రకటిస్తున్నారు.

nitin check triler

ఈ క్రమంలో నితిన్ చెక్ కూడా విడుదలకు రెడీ అయింది. చెక్ థియేట్రికల్ ట్రైలర్‌ను ఫిబ్రవరి 3న విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. థియేట్రికల్ ట్రైలర్ విడుదల సందర్భంగా చెక్ రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. చంద్రశేఖర్ యేలేటి ఈ సినిమాను తెరకెక్కించగా.. ఇందులో నితిన్‌ను కొత్తగా చూపించారు.