భీష్మ, రష్మికలకి ఇరగదీసే స్టెప్స్ కంపోజ్ చేస్తున్న శేఖర్ మాస్టర్

నితిన్ రష్మిక జంటగా వెంకీ కుడుములు డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీపావళి సందర్బంగా భీష్మ సినిమా నుంచి రెండు పోస్టర్ బయటకి వచ్చి సినీ అభిమానులని ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రంలోని సాంగ్ షూట్ కంప్లీట్ చేశారు. రష్మిక, నితిన్ లపై కంపోజ్ చేసిన సాంగ్ కి శేఖర్ మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చేశాడు.

ఇక సినిమాలో కామెడీ చాల బాగా వస్తోందని తెలుస్తోంది. ముఖ్యంగా వెన్నల కిశోర్ అండ్ నితిన్ ట్రాక్ సినిమాలో హైలెట్ అవుతుందని సమాచారం. మొత్తానికి వెంకీ కుడుముల ‘ఛలో’ లాగే భీష్మని కూడా ఫుల్ ఎంటెర్టైనింగా తెరకెక్కిస్తున్నాడు. రష్మికతో పాటు భీష్మలో హెబ్బా పటేల్ ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.