నితిన్ ముహూర్తం ఫిక్స్ చేశాడు… గ్లిమ్ప్స్ వచ్చేస్తోంది

ఫుల్ ఫామ్ లో ఉన్న నితిన్ అండ్ రష్మిక కలిసి నటిస్తున్న సినిమా భీష్మ. చలో ఫేమ్ వెంకీ కుడుములు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి సినీ అభిమానులని ఆకట్టుకున్నాయి. లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్ప్స్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేయనున్నారు. టీజర్ కన్నా ముందు ఒక చిన్న వీడియో రిలీజ్ చేస్తే బజ్ పెరుగుతుంది కాబట్టే చిత్ర యూనిట్ ఈ ప్లాన్ వేసినట్లు ఉన్నారు. నవంబర్ 7 ఉదయం 10 గంటలకు భీష్మ ఫస్ట్ గ్లిమ్ప్స్ రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి మణిశర్మ కొడుకు మహతి సాగర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

ప్రస్తుతం రష్మిక క్రేజ్ మాములుగా లేదు, సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలో నటిస్తున్న రష్మిక, భీష్మ సినిమాలో ఉండడం ఈ మూవీకి బాగా హెల్ప్ అయ్యే విషయం. చలోని ఫన్ రైడ్ గా మలిచిన వెంకీ కుడుములు, భీష్మని కూడా అందరికీ నచ్చేలా తెరకెక్కిస్తున్నాడట. మరి ఈ సినిమా ఆడియన్స్ ని ఎంత వరకూ అట్రాక్ట్ చేస్తోందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాలి కానీ అప్పటివరకూ ఆగకుండా భీష్మ గ్లిమ్ప్స్ వస్తుంది అది చూసి ఎంజాయ్ చేయండి.