Nithin Movie: పెంట మీద రాయి వేస్తే మ‌న బ‌ట్ట‌లే పాడ‌వుతాయి.. నితిన్ “రంగ్‌దే” చిత్ర ట్రైల‌ర్‌!

Nithin Movie: టాలీవుడ్ హీరో నితిన్‌, కీర్తి సురేశ్ జంటగా రంగ్‌దే చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో.. పీవీడీ ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ Nithin Movie చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్ల్, సాంగ్స్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఫిదా చేశాయి. దీంతో ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల్లో ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం.. హ‌య్ నేను అర్జున్ ..దేవుణ్ణి గ‌ర్ల్‌ఫ్రెండ్ కావాల‌ని కోరుకున్నాను.. కోరుకున్న ఆరో సెక‌న్‌కు ఒక పాప మా కాల‌నీకి వ‌చ్చింది.. అప్ప‌టినుంచి తొక్క‌డం స్టార్ట్ చేసింది నా జీవితాన్ని అంటూ నితిన్ చెప్పే డైలాగ్‌తో ట్రైల‌ర్ ప్రారంభం కాగా..

అలాగే పెంట‌మీద రాయి వేస్తే మ‌న బ‌ట్ట‌లే పాడ‌వుతాయి అని నితిన్ అంటే.. లేదు లేదు ఇంటికెళ్లి స‌ర్ఫ్‌పెట్టి ఉతుక్కుంటాను అని కీర్తి సురేశ్ చెప్పే సీన్ ఎంతో ఫ‌న్నీగా ఉంటుంది.. మొత్తానికి ఈ చిత్ర ట్రైల‌ర్ ఆద్యంతం న‌వ్వులు పంచుతూ ఆక‌ట్టుకునేలా సినిమా తీర్చిదిద్దిన‌ట్లు ట్రైల‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఇక ఈNithin Movieచిత్రానికి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు దేవీశ్రీ‌ప్ర‌సాద్ స్వ‌రాలు అందిస్తున్నారు. ఈ నెల 26న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.