Tollywood: “రంగ్ దే” నితిన్, కీర్తి సురేష్‌ల‌ వినోద భరిత సాంగ్ రిలీజ్..

Tollywood: యూత్ స్టార్ ‘నితిన్’, ‘కీర్తి సురేష్’ ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ రంగ్ దే చిత్రాన్ని‌ నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి ‘ప్రతిభగల యువ దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో.. Tollywoodనిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు. ఇటీవల ‘రంగ్ దే‘ చిత్రం నుంచి విడుదల అయిన తొలి గీతానికి కోటి కి పైగా వ్యూస్ వచ్చిన నేపథ్యంలో.. ఈ చిత్రానికి సంబంధించిన మలి గీతాన్ని వీడియో రూపంలో ఈరోజు విడుదల చేసింది చిత్రం యూనిట్. ‘ప్రేమ’ తో కూడిన కుటుంబ కధా చిత్రం అయిన ఈ ‘రంగ్ దే’ లోని ఈ ద్వితీయ గీతం వివరాల్లోకి వెళితే .

“సింపుల్ గుండే లైఫు.. టెంపుల్ రన్ లా మారే.. ఈ రంగు రంగు లోకం .. చీకట్లోకి జారే లవ్లీ గుండే కళలే.. లైఫే లేనిదాయే స్మైలీ లాంటి ఫేసే…. స్మైలే లేనిదాయేష‌ అంటూ సాగే ఈ పల్లవి గల గీతానికి శ్రీమణి సాహిత్యం సమకూర్చారు. గాయకుడు సాగర్ గాత్రంలో ఈ గీతం ఆకట్టుకుంటుంది. ప్రసిద్ధ Tollywoodసంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ గీతానికి అందించిన స్వరాలు సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తాయి. ఈ చిత్ర హీరోహీరోయిన్ల్ అయినా నితిన్, కీర్తి సురేష్ లపై చిత్రీకరించిన ఈ గీతాన్ని వెండితెరపై వినోద భరితంగా వీక్షకులకు కనువిందు కలిగేలా చిత్రీకరించారు దర్శకుడు వెంకీ అట్లూరి. నృత్య దర్శకుడు శేఖర్ ఈ సందర్భ శుద్ధి గల గీతానికి భిన్నమైన నృత్య రీతులను సమకూర్చారు. ‘రంగ్ దే’ చిత్రం మార్చి 26న విడుదల అవుతున్న నేపథ్యంలో చిత్రం ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. సకుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రంగా దీనికి రూపకల్పన చేశారు Tollywoodదర్శకుడు ‘వెంకీ అట్లూరి’. యూత్ స్టార్ నితిన్, నాయిక కీర్తి సురేష్ ల జంట వెండితెరపై కనువిందు చేయనుందన్న నమ్మకం విడుదల అవుతున్న ప్రచార చిత్రాలు, వీడియో దృశ్యాలు, గీతాలు మరింత పెరిగేలా చేస్తున్నాయి. ఈ ‘రంగ్ దే’ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, వినీత్,రోహిణి, కౌసల్య,బ్రహ్మాజీ,వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,అభినవ్ గోమటం,సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి డి.ఓ.పి.: పి.సి.శ్రీరామ్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కూర్పు: నవీన్ నూలి: కళ: అవినాష్ కొల్లా. అడిషనల్ స్క్రీన్ ప్లే : సతీష్ చంద్ర పాశం. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్), పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్, నిర్మాత:సూర్యదేవర నాగవంశి, రచన,దర్శకత్వం: వెంకీ అట్లూరి.