నితిన్ హీరోగా చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో కొత్త చిత్రం!

ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు కేరాఫ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా స‌క్సెస్‌ఫుల్ నిర్మాణ సంస్థ భ‌వ్య క్రియేష‌న్స్ ఓ చిత్రాన్ని నిర్మించ‌నుంది. వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుని, వాటిని హృద్యంగా మ‌లిచే చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హించ‌నున్నారు. భ‌వ్య క్రియేష‌న్స్ అధినేత వి.ఆనంద‌ప్ర‌సాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి హోలీ సంద‌ర్భంగా హీరో నితిన్ ట్విట్ట‌ర్‌లో ప్ర‌క‌టించారు.

హీరో నితిన్ మాట్లాడుతూ “నేను ఇంత‌కు ముందే చెప్పిన‌ట్టు… నా కొత్త చిత్రాన్ని ప్ర‌క‌టిస్తున్నాను. సుప్రీమ్లీ టాలెంటెడ్ డైర‌క్ట‌ర్ చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌బోతున్నా. చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది. కీర‌వాణిగారు స్వ‌రాల‌ను స‌మ‌కూరుస్తారు.ఏప్రిల్ ద్వితీయార్ధంలో చిత్రాన్ని మొద‌లుపెడ‌తాం. మిగిలిన వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాం“ అని అన్నారు.