Tollywood: రేపు నితిన్ కొత్త మూవీ టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్ అనౌన్స్‌..

Tollywood: టాలీవుడ్ యంగ్ హీరో మాంచి జోష్ మీదున్నాడు.. ఇటీవలే తాను న‌టించిన రంగ్ దే చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి.. పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది.. ఇందులో నితిన్ స‌ర‌స‌న కీర్తి సురేశ్ హీరోయిన్‌గా న‌టించి వీరి జోడీ తెర‌పై ఓ రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం సక్సెస్‌తో ఆనందోత్సావాల్లో మునిగి తేలుతున్నాడు నితిన్‌.. కాగా తాజాగా నితిన్ మూవీ నుంచి స‌రికొత్త అప్‌డేట్ వ‌చ్చింది. బాలీవుడ్‌లో ఘ‌న విజ‌యవంత‌మైన అంధాదున్ రీమేక్ చిత్రంలో నితిన్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. రాజ్ కుమార్ ఆకెళ్ల స‌మ‌ర్ప‌ణ‌లో శ్రేష్ఠ మూవీస్ బ్యాన‌ర్‌పై ఎన్‌. సుధాక‌ర్‌రెడ్డి, నికిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నితిన్ కెరీర్‌లో 30వ సినిమాగా వ‌స్తున్న ఈ చిత్రంలో న‌భా న‌టేశ్ హీరోయిన్‌గా.. మిల్క్‌బ్యూటీ త‌మ‌న్నా ఓ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుంది. అయితే రేపు ఈ చిత్రం టైటిల్, ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ చేయ‌నున్నారు చిత్ర‌బృందం. రేపు మంగ‌ళ‌వారం మార్చి30 ఉద‌యం 12గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు పోస్ట‌ర్ ద్వారా మేకర్స్ వెల్ల‌డించారు. ఇక ఈ చిత్రానికి మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం అందిస్తుండ‌గా.. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం జూన్ 11న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఇదివ‌ర‌కే చిత్ర‌బృందం వెల్ల‌డించారు.