Maestro: నేడు నితిన్ బ‌ర్త్‌డే.. వైవిధ్య‌మైన టైటిల్ పోస్ట‌ర్ రిలీజ్‌!

Maestro: టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ నేడు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం నుంచి టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ చేశారు మేక‌ర్స్‌. ఇటీవలే తెర‌పైకి వ‌చ్చిన నితిన్ రంగ్‌దే చిత్రం పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాన్ని అందుకుంది. ఈ సినిమాలో నితిన్ స‌ర‌స‌న కీర్తి సురేశ్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సంపాదించుకోగా.. మాంచి జోష్ మీదున్నాడు నితిన్‌.. కాగా నేడు ఆయ‌న బ‌ర్త్‌డే కానుక‌గా.. బాలీవుడ్ హిట్ మూవీ అంధాదున్ రీమేక్ చిత్రంలో న‌టిస్తున్న Maestro నితిన్ ఫ‌స్ట్‌లుక్‌, టైటిల్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. పోస్ట‌ర్‌లో నితిన్ ఎంతో స్టైలిష్‌గా..

సూట్ ధ‌రించి చేతిలో వాకింగ్ స్టిక్ ప‌ట్టుకుని క‌నిపిస్తున్నాడు. ఆ క‌ళ్ల‌కు న‌ల్ల‌ద్దాలు ధ‌రించిన నితిన్‌.. ఇందులో అంధుడిగా క‌నిపించ‌నున్న‌ట్లు ఆ పోస్ట‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారుతుంది. ఇందులో నితిన్ కు జోడీగా న‌భాన‌టేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. మిల్క్‌బ్యూటీ త‌మ‌న్నా ఓ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుంది. ఈ Maestro చిత్రాన్ని శ్రేష్ఠ మూవీస్ బ్యాన‌ర్‌లో ఎన్‌. సుధాక‌ర్‌రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తుండ‌గా.. మేర్ల‌పాక గాంధీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. నితిన్ 30 మ్యాస్ట్రో చిత్రాన్ని జూన్ 11న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ఆ పోస్ట‌ర్‌లో మ‌రోసారి ప్ర‌క‌టించారు.