Nithin: నేడు చెక్ రిలీజ్‌.. శ్రీ‌వారి సేవ‌లో నితిన్!

Nithin: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ న‌టించిన తాజా చిత్రం చెక్‌. ఈ చిత్రానికి చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఇందులో నితిన్‌కు జోడీగా వింక్ గాళ్ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోయిన్‌గా చేస్తుండ‌గా.. ఫిట్‌నెస్ భామ ర‌కుల్ ప్రీత్‌సింగ్ ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌ను పోషిస్తుంది. ఇక ఈ చిత్రాన్ని భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఆనంద్ ప్ర‌సాద్ నిర్మిస్తుండ‌గా.. ఈ రోజు ఫిబ్ర‌వ‌రి 26న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

ఈ సంద‌ర్భంగా చెక్ హీరోNithin నితిన్ తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. శుక్ర‌వారం ఉద‌యం వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌న స‌మ‌యంలో ఆల‌యానికి చేరుకున్న నితిన్‌కు టీటీడీ అధికారులు స్వామి వారి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. అనంత‌రం రంగ‌నాయ‌క మండ‌పం వ‌ద్ద స్వామి తీర్థ ప్ర‌సాదాలు అందించారు. ఈ సంద‌ర్భంగా నితిన్‌తో సెల్ఫీలు తీసుకోవ‌డానికి భ‌క్తులు ఉత్సాహం క‌నబ‌రిచారు. ఇక Nithinనితిన్ న‌టిస్తున్న తాజా చిత్రం రంగ్‌దే.. ఇందులో నితిన్ స‌ర‌స‌న కీర్తి సురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన రంగ్‌దే చిత్రం మార్చి 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది.