Nithin: నితిన్ చెక్ టీజ‌ర్ రిలీజ్ చేసిన చిత్ర‌బృందం..

Nithin: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ న‌టిస్తున్న‌ తాజా చిత్రం చెక్‌. ఈ చిత్రాన్ని యేలేటి చంద్ర‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ఇందులో నితిన్‌కు జోడీగా ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టీజ‌ర్ రిలీజ్ చేశారు చిత్ర‌బృందం.

ఇందులో Nithin నితిన్ ఖైదీగా క‌నిపిస్తూ అల‌రిస్తున్నాడు. ఉరిశిక్ష ప‌డిన ఖైదీ జీవిత నేప‌థ్యం ఆధారంగా తెర‌కెక్కుతుంది ఈ చిత్రం. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుందని స‌మాచారం. ఇక ఈ చిత్రాన్ని భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వి. ఆనంద్‌ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ఇక Nithin నితిన్ ప్ర‌స్తుతం న‌టించిన రంగ్‌దే చిత్రం కంప్లీట్ చేసి మార్చి 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.