Nithin: ఆ అవకాశం వస్తే… నా ఫస్ట్‌ ఛాయిస్‌ పవన్‌కల్యాణ్‌గారే: నితిన్

Nithin: యూత్‌ స్టార్‌ నితిన్‌ హీరోగా చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ నిర్మించిన సినిమా ‘చెక్‌’. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్లు. ఈ సినిమా ఫిబ్రవరి 26న విడుదల కానున్న నేపథ్యంలో పాత్రికేయ మిత్రులతో నితిన్‌ సమావేశమయ్యారు. నితిన్‌ ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు… ‘చెక్‌’ సినిమా ఎలా మొదలైంది?
– ‘భీష్మ’ సినిమా అంగీకరించిన సమయంలోనే ‘చెక్‌’ అంగీకరించా. ఒక కమర్షియల్‌ సినిమా, ఒక డిఫరెంట్‌ సినిమా చేయాలనే ఆలోచనతో ఈ సినిమాకు ఓకే చెప్పా. లాస్ట్‌ ఇయర్‌ ‘భీష్మ’ విడుదలైంది. తర్వాత లాక్‌డౌన్‌ రావడంతో ‘చెక్‌’ చిత్రీకరణ ఆలస్యమైంది.
డిఫరెంట్‌ సినిమాలు, ప్రయోగాలు చేయాలని ఎప్పుడు అనిపించింది? – ‘శ్రీనివాస కల్యాణం’ తర్వాత! మూడు ఫ్లాపులు రావడంతో ఓ కమర్షియల్‌ సినిమా, మరో డిఫరెంట్‌ సినిమా చేయాలని డిసైడ్‌ అయ్యా. డిఫరెంట్‌ సినిమాలు తీయడంతో చంద్రశేఖర్‌ యేలేటిగారు మాస్టర్‌ కాబట్టి ‘చెక్‌’ ఒప్పుకొన్నా.

pavan-nithin


చంద్రశేఖర్‌ యేలేటిగారు ‘చెక్‌’ స్ర్కిప్ట్‌, మీ క్యారెక్టర్‌ చెప్పినప్పుడు ఏమనిపించింది?
– ఫస్ట్‌ వేరే కథ చెప్పారు. ఆ స్ర్కిప్ట్‌ లైన్‌ బావుంది. రెండు నెలలు ట్రావెల్‌ చేశాం. అయితే, ఆ స్ర్కిప్ట్‌ మీద ఆయన అంత కాన్ఫిడెంట్‌గా లేరు. నాకూ అంత కాన్ఫిడెన్స్‌ రాలేదు. మళ్లీ రెండు నెలలు గ్యాప్‌ తీసుకుని వచ్చి ‘చెక్‌’ స్ర్కిప్ట్‌ చెప్పారు. లైన్‌ చెప్పగానే ఇన్‌స్టంట్‌గా నచ్చింది. కథలో ఎక్కువ శాతం జైలులో జరుగుతుంది. సాంగ్స్‌ లేవు. రొమాంటిక్‌, కామెడీ ట్రాక్స్‌ లేవు.

అసలు, కథేంటి?
– ఆదిత్య జీవిత ప్రయాణమే ‘చెక్‌’. అతను జైలులో ఉండే ఓ ఖైదీ. చెస్‌ నేర్చుకుని ఎలా గ్రాండ్‌ మాస్టర్‌ అయ్యాడు? అనేది సినిమా. చంద్రశేఖర్‌ యేలేటిగారు కథ చెప్పినప్పుడు నాకు క్లైమాక్స్‌ నచ్చింది. లాస్ట్‌ 15 మినిట్స్‌ హైలైట్‌. అక్కడ యేలేటిగారి మార్క్‌ అంతా కనిపిస్తుంది.

కొత్త నితిన్‌ను చూస్తారని చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు!
– అవును. నా యాక్టింగ్‌ కొత్తగా ఉంటుంది. అందరికీ నచ్చుతుంది. సినిమా చాలామంది చూశారు. వందమంది చూస్తే, వందమందికీ నచ్చింది. అందరూ బావుందని చెప్పారు.

ఎక్కువశాతం సినిమా జైలులో జరుగుతుంది కాబట్టి క్యారెక్టర్‌ కోసం ప్రత్యేకంగా ఏమైనా ప్రిపేర్‌ అయ్యారా?
– లేదండీ. సెట్‌కి వెళ్లాక యేలేటిగారు ఏం చెబితే అది ఫాలో అయ్యా. ‘భీష్మ’, ‘రంగ్‌ దే’ సెట్స్‌లో కాస్త జోవియల్‌గా ఉండేవాణ్ణి. ‘చెక్‌’ సెట్‌లో మాత్రం కామ్‌గా ఉండేవాడ్ని. జైలులో ఖైదీ క్యారెక్టర్‌ కాబట్టి సెట్‌ వాతావరణం అంతా డార్క్‌గా ఉండేది. షాట్‌ చేయడం, తర్వాత పక్కకి వెళ్లి కామ్‌గా కూర్చోవడం… అంతే!

కొత్త క్యారెక్టర్లు చేసినప్పుడు రీసెర్చ్‌ చేస్తారు కదా! మీరు?
– నేనేం చేయను. నా డైరెక్టర్లను ఫాలో అవుతా. డైరెక్టర్లు ఏం చేబితే… అది ఫాలో అవుతా. దర్శకులందరూ మంచివాళ్లు.

రాజమౌళిగారు ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌లో మీ గురించి గొప్పగా చెప్పారు. మీ ఫీలింగ్‌ ఏంటి?
– ఇట్‌ ఫీల్స్‌ గ్రేట్‌. రాజమౌళి లాంటి గొప్ప దర్శకుడి నుంచి కాంప్లిమెంట్స్‌ రావడం గ్రేట్‌.

సినిమాలో మీరు డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నారా? ట్రైలర్‌ చూస్తే అలా…
– లేదు లేదు. నాది సింగిల్‌ రోలే. ఫ్లాష్‌బ్యాక్‌ పార్ట్‌ ఉంది. అందులో కలర్‌ఫుల్‌ కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తా.

ప్రియా ప్రకాశ్‌ వారియర్‌తో వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌?
– వెరీ నైస్‌. తెలుగులో ఆమెకు తొలి సినిమా ఇది. చాలా బాగా నటించింది.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గురించి?

  • యాక్చువల్లీ… రకుల్‌కి థ్యాంక్స్‌ చెప్పాలి. సినిమాలో తను లాయర్‌ రోల్‌ చేసింది. తనకు, నాకు మధ్య సాంగ్స్‌ లేవు. రొమాంటిక్‌ ట్రాక్‌ లేదు. ఓ మంచి క్యారెక్టర్‌లో నటించడానికి ముందుకు వచ్చింది. సినిమాలో ఇంపార్టెంట్‌ రోల్‌ ప్లే చేసింది.

భవ్య క్రియేషన్స్‌ సంస్థలో తొలిసారి సినిమా చేశారు. ఈ బ్యానర్‌లో వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌?

  • ఇటువంటి సినిమాను ప్రొడ్యూస్‌ చేయడం గ్రేట్‌. ఇది రెగ్యులర్‌ సినిమా కాదు. డిఫరెంట్‌ సినిమా. ఇటువంటి సినిమాలకు ఖర్చు పెట్టవచ్చు. అయితే, ఓ పది కోట్లు లేదా కొంత పెడతారు. కానీ, భారీ బడ్జెట్‌తో సినిమా ప్రొడ్యూస్‌ చేసిన ఆనందప్రసాద్‌గారు గ్రేట్‌ అని చెప్పాలి. సినిమా బాగా ఆడి వాళ్లకు డబ్బులు బాగా రావాలని కోరుకుంటున్నాను.

‘చెక్‌’ వంటి సినిమాకు రీ–రికార్డింగ్‌ ఇంపార్టెంట్‌. కల్యాణీ మాలిక్‌ ఎలా చేశారు?
– రీ–రికార్డింగ్‌తో సినిమాను నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకువెళ్ళారు. ఆయన అంత మంచి మ్యూజిక్‌ ఇచ్చారు.

సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయిన ఫస్ట్‌ వీక్‌ ఎక్కువ టేక్స్‌ తీసుకున్నారట?
– అవును. యేలేటిగారి స్టయిల్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ వేరు. అర్థం చేసుకోవడానికి ఓ వారం పట్టింది. అప్పుడు ఎక్కువ టేక్స్‌ తీసుకున్నా. తర్వాత ఈజీగా చేశా. ‘జయం’ తర్వాత అన్ని ఎక్కువ టేక్స్‌ తీసుకున్నది ఈ సినిమాకే. ఐటెమ్‌ సాంగ్స్‌, రొమాంటిక్‌ సాంగ్స్‌, కామెడీ ఎపిసోడ్స్‌ వంటివి ఏమీ ఉండదు. సినిమా అంతా కంటెంట్‌ ఉంటుంది. లాక్‌డౌన్‌లో ప్రజలందరూ ఓటీటీల్లో డిఫరెంట్‌ సినిమాలు చూశారు. వాళ్ళు కూడా డిఫరెంట్‌ సినిమాలు కోరుకుంటున్నారు. తప్పకుండా ఈ సినిమా జనాలకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ సినిమాకు సీక్వెల్‌ చేసే ఐడియా ఉంది. క్లైమాక్స్‌ చూస్తే మీకూ అర్థమవుతుంది.

ఈ సినిమా చేయడం రిస్క్‌ అనిపించలేదా?
– రెండేళ్ల క్రితం అయితే రిస్క్‌ ఏమో! ఇప్పుడు ఆడియన్స్‌ డిఫరెంట్‌ సినిమాలు, ఓటీటీలో కొత్త కంటెంట్‌ చూస్తున్నారు. ‘నాంది’, ‘ఉప్పెన’ ఆడాయి. ఇటువంటి సినిమాలకు ఫ్యాన్స్‌ ఉన్నారు.

మ్యారేజ్‌ తర్వాత ఫస్ట్‌ మూవీ! అదీ కంటెంట్‌ ఓరియెంటెడ్‌ మూవీ. ప్లాన్‌ చేసుకుని చేశారా?
– ఏం ప్లాన్‌ లేదు. పెళ్లికి ముందే సినిమా ఒప్పుకొన్నా. లాక్‌డౌన్‌ వల్ల సినిమా డిలే అయ్యింది. అటువంటి ప్లానింగ్‌ ఏమీ లేదు.

పెళ్లి తర్వాత విడుదలవుతున్న సినిమా ఇదే. మీరెంత ఎగ్జైటెడ్‌గా ఉన్నారు. వైఫ్‌ ఎంత ఎగ్జైటెడ్‌గా ఉన్నారు?
– నాకు ఎగ్జైట్‌మెంట్‌ ఏమీ లేదు. సినిమా ఆడితే లక్‌ అంటారు. ఆడకపోతే ఆమె బ్యాడ్‌లక్‌ అంటారు. అందుకని, తనకు కొంచెం టెన్షన్‌ ఉంది.

సినిమా టీజర్‌, ట్రైలర్‌ చూసి మీ వైఫ్‌ ఏమన్నారు?
– తనకు బాగా నచ్చింది.

ఆవిడతో సినిమాల గురించి షేర్‌ చేసుకుంటారా?
– లేదు. సినిమాల గురించి మాట్లాడను. మా మధ్య సినిమా, స్టోరీ డిస్కషన్లు ఉండవు. అది వేరే జీవితం, ఇది వేరే జీవితం!

మ్యారీడ్‌ లైఫ్‌ ఎలా ఉంది?
– సేమ్‌! నాకు పెద్ద తేడా ఏమీ లేదు. పెళ్లికి ముందు షాలిని ఇంటికి వచ్చి వెళ్తుండేది. పెళ్లి తర్వాత ఎప్పట్నుంచో తను ఇంట్లో ఉన్న ఫీలింగ్‌. ఇంట్లో మెంబర్‌లా ఉంది తప్ప నాకు కొత్తగా ఏమీ లేదు.

వాళ్ళది డాక్టర్స్‌ ఫ్యామిలీ, మీది యాక్టర్స్‌ ఫ్యామిలీ…
– యాక్టర్‌ అండ్‌ డాక్టర్‌… బాగా సింక్‌ అయ్యింది. నాకు ఏదైనా అనారోగ్యం వస్తే, ఇంతకు ముందు డాక్టర్‌ దగ్గరకు వెళ్ళేవాడ్ని. ఇప్పుడు అత్తమామలకు ఫోన్‌ చేసి అడగొచ్చు.

మల్టీస్టారర్‌ ఫిల్మ్స్‌ చేసే ఇంట్రెస్ట్‌ ఉందా?
– ఉంది. అవకాశం వస్తే… నా ఫస్ట్‌ ఛాయిస్‌ పవన్‌కల్యాణ్‌గారే. ఆ ఛాన్స్‌ ఎప్పుడు వస్తుందా? అని వెయిట్‌ చేస్తున్నా.

మీ ప్రతి సినిమాలో పవన్‌ కల్యాణ్‌గారి ప్రస్తావన ఉంటుంది. మరి, ఈ సినిమాలో?

  • ఇందులో ఆ స్కోప్‌ లేదు. జైలులో పవన్‌గారి ఫొటో పెడితే బాగోదు.

మీ నెక్ట్స్‌ సినిమాలు?
– ‘రంగ్‌ దే’ చిత్రీకరణ పూర్తి చేశా. ‘అంధాధున్‌’ రీమేక్‌ షూటింగ్‌ సగం అయ్యింది. ఈ రెండు సినిమాల రిలీజ్‌ డేట్స్‌ అనౌన్స్‌ చేశాం. మేలో ‘పవర్‌ పేట’ షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తా. కుదిరితే ఆ సినిమా డిసెంబర్‌లో విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం. మరో సినిమాలు యాక్సెప్ట్‌ చేశా. ప్రజెంట్‌ ఉన్నవి రిలీజ్‌ అయ్యాక వాటి గురించి చెబుతా.