హీరో నితిన్, టాలెంటెడ్ మేకర్ వెంకీ కుడుములతో చేస్తున్న చిత్రంలో ‘రాబిన్‌హుడ్’గా అందరినీ అలరించబోతున్నారు. ఈ సక్సెస్ ఫుల్ కాంబో యూనిక్, క్రేజీ ప్రాజెక్ట్‌తో రాబోతోంది. టైటిల్ గ్లింప్స్ అందరి దృష్టిని ఆకర్షించింది. నితిన్ పాత్రను పరిచయం చేసిన గ్లింప్స్ ఫన్నీగా ఉంది, అదే సమయంలో, కాన్సెప్ట్ , ప్రెజెంటేషన్ పరంగా సరికొత్తగా వుంది. విజయవంతమైన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది.
రాబిన్‌హుడ్ కీలక షెడ్యూల్ తాజాగా మున్నార్‌లో పూర్తయింది. ఈ షెడ్యూల్లో ముఖ్యమైన టాకీ పార్ట్స్, నితిన్, ఇతర నటీనటులపై భారీ యాక్షన్ బ్లాక్‌ను చిత్రీకరించింది టీం. త్వరలోనే సినిమా తదుపరి షెడ్యూల్‌ను ప్రారంభించనున్నారు.
నితిన్ సరికొత్త పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో ట్రెండీ లుక్‌లో అలరించనున్నారు. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి అత్యున్నత సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. గ్లింప్స్ కోసం అద్భుతమైన స్కోర్‌ను అందించారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటర్, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్.
తారాగణం: నితిన్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: వెంకీ కుడుముల
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
సిఈవో: చెర్రీ
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ: సాయి శ్రీరామ్
ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో