బాలీవుడ్ దర్శకుడు నటుడు నిశికాంత్ కామత్ తీవ్ర అనారోగ్యంతో కొద్దిసేపటి క్రితమే మరణించారు. గత కొంతకాలంగా కాలేయ వ్యాధితో బడపడుతున్న ఆయన రీసెంట్ గా చికిత్స కోసం హైదరాబాద్ కు వచ్చారు. గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉండగా నిశికాంత్ తుది శ్వాస విడిచారు.
గత వారమే వైద్యులు ఆయన పరిస్థితి క్రిటికల్ గా ఉందని ఐసీయూలోనే ఉంచి మెరుగైన చికిత్స అంధించారు. ఈ విషయంపై ఏఐజీ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసింది. ఇక రీసెంట్ గా పరిస్థితి మరింత విషమించడంతో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. 50 ఏళ్ళ నిశికాంత్ ‘డోంబివాలీ ఫాస్ట్’ అనే మరాఠీ సినిమా ద్వారా 2005లోనే దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఆ సినిమాకు నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు
నటుడిగా కూడా నిశికాంత్ కొన్ని సినిమాలతో మంచి క్రేజ్ అందుకున్నారు. ఇక బాలీవుడ్ లో మొదట ముంబై మేరీ జాన్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా సక్సెస్ కావడంతో ఫోర్స్’, ‘లై భారీ’ అనే సినిమాలను తెరకెక్కించాడు. ఇక ఆ తరువాత మలయాళం హిట్ సినిమా దృశ్యం సినిమాను హిందీలో అజయ్ దేవ్ గన్ తో అదే పేరుతో రీమేక్ చేసి హిట్ అందుకున్నాడు ఈ దర్శకుడు. ఇక 2022లో దర్బాదార్ అనే సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ఈ దర్శకుడు గ్రాండ్ షెడ్యూల్ కూడా ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఇంతలో అనారోగ్యంతో ప్రాణాలు విడువడంతో ఆ సినిమాకు సంబంధించిన యూనిట్ సభ్యులు షాక్ కి గురవుతున్నారు.