కేంద్ర బడ్జెట్ హైలెట్స్…. ప్రజలకు వరాలు

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా పేపర్‌లెస్ విధానంలో డిటిజల్ పద్దతిలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ప్రతిసారి ఒక బడ్జెట్ బుక్ తయారుచేస్తారు. దానిని ఆర్థికశాఖ మంత్రి పార్లమెంట్‌లో చదువుతారు. అయితే ఈ సారి కరోనా క్రమంలో ఒక ట్యాబ్ ద్వారా ఆర్ధికశాఖ మంత్రి బడ్జెట్ చదివి వినిపిస్తున్నారు.

NIRMALA CENTRAL BUDGET

ఈ బడ్జెట్‌లో దేశ ప్రజలకు పలు వరాలు ప్రకటించారు. 75 ఏళ్లుపైబడిన సీనియర్ సిటిజన్లకు ఐటీ ఫైలింగ్ నుంచి మినహాయింపు ప్రకటించారు. పించన్, వడ్డీ ఆదాయం ఆధారంగా ఐటీ మినహాయింపు ఇవ్వనున్నారు. ఇక వీధి వ్యాపారులను సామాజిక భద్రత పథకంలోకి చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. రానున్న మూడేళ్లల్లో మరిన్ని జిల్లాల్లో ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేస్తామని, మరో కోటిమందికి ఉజ్వల పథకం అమలు చేస్తామంది. ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకాన్ని మరో ఏడాది పొడిగించడంతో పాటు 31 మార్చి 2022 వరకు గృహాల కొనుగోలుపై రాయితీ ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపలింది.