ఈ సినిమాతో అయినా లైన్ లోకి వస్తావా చిన్నవాడా?

కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ కెరీర్ బిల్డ్ చేసుకున్న యంగ్ హీరో నిఖిల్ టైం అసలు బాగోలేదు. నిఖిల్ నటించిన లాస్ట్ మూవీ అర్జున్ సురవరం దాదాపు 6 నెలల క్రితమే రిలీజ్ కావాల్సి ఉన్నా ఇప్పటి వరకూ విడుదల కాలేదు. హీరోగా అయినప్పటి నుంచి ఇప్పటి వరకూ నిఖిల్, ఇంత బ్యాడ్ ఫేజ్ ఎప్పుడూ చూసి ఉండడు. ఈ టైంలో నుంచి బయటకి వచ్చి మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కడానికి నిఖిల్, తన ఫ్రెండ్ అండ్ డైరెక్టర్ చందూ మొండేటితో కలిశాడు. గతంలో ఈ కలయికలో వచ్చిన సినిమా కార్తికేయ, దేవాలయం చుట్టూ తిరిగిన కథతో తెరకెక్కిన ఈ సినిమా నిఖిల్ కి మంచి హిట్ ఇచ్చింది. చందుకి కూడా మంచి డెబ్యూ మూవీ అయ్యింది. 2014లో వచ్చిన ఈ మూవీకి ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేశారు, ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను అక్టోబర్ రెండో వారం నుండి మొదలుపెట్టనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలోని ఇతర నటీనటులు మరియు సాంకేతికవర్గానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Karthikeya - 2