నిహారిక పెళ్లికార్డు చూశారా?

మెగా డాటర్ నిహారిక పెళ్లిపీటలు ఎక్కేందుకు సమయం దగ్గర పడింది. ముహూర్తం దగ్గర పడుతోంది. ఇంకో ఏడు రోజులు మాత్రమే పెళ్లికి సమయం ఉండటంతో పెళ్లి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 9న గుంటూరుకి చెందిన ఐజీ కుమారుడు చైతన్య జోన్నలగడ్డను నిహారిక పెళ్లి చేసుకోనున్న విషయం తెలిసిందే. రాజస్థాన్‌లో గల ఉదయ్‌పూర్‌లోని ఖరీదైన విలస్ కోర్ట్ ప్యాలెస్‌లో నిహారిక పెళ్లి జరగనుంది.

wedding card

ఈ పెళ్లి ఏర్పాట్ల కోసం 10 రోజుల క్రితమే నిహారిక, చైతన్యల ఫ్యామిలీ ఉదయ్ పూర్ చేరుకుంది. అక్కడ పెళ్లి ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. ఈ పెళ్లికి మెగాస్టార్ చిరంజీవితో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా హాజరుకానున్నారని తెలుస్తోంది. పెళ్లి తర్వాత డిసెంబర్ 11న హైదరాబాద్‌లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో విందు కార్యక్రమం జరగనుంది.

ఈ క్రమంలో నిహారిక పెళ్లికార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా ఖర్చు పెట్టి డిఫరెంట్‌గా వెడ్డింగ్ కార్డు చేపించారు. ఒక బుల్లి పెట్టెలో మెరూన్ కలర్‌లో ఇన్విటేషన్ కార్డు డిజైన్ చేశారు. ఈ కార్డుతో పాటు పెట్టెలో చాక్లెట్స్ కూడా ఉన్నాయి. ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ వెడ్డింగ్ కార్డుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. కాగా నిహారిక, చైతన్యలది లవ్ మ్యారేజ్ అనే విషయం తెలిసిందే. గత కొద్ది సంవత్సరాలుగా ప్రేమించుకున్న వీరిద్దరు చివరికి బంధువులను ఒప్పించి ఒక్కటి కానున్నారు.