అదృష్టాన్ని వదులుకున్న మెగా డాటర్

త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్న మెగా డాటర్ నిహారిక మంచి అవకాశాన్ని వదులుకుందట. ఇటీవల ఆహా యాప్‌లో విడుదలై భారీ విజయం సాధించిన కలర్ ఫొటో సినిమాలో నటించే అవకాశాన్ని ఈ బ్యూటీ వదులుకుందట. కరోనా ప్రభావం క్రమంలో భయపడి ఈ సినిమాలో నటించనని చెప్పిందట. ఇప్పుడు సినిమా హిట్ అయిన తర్వాత ఎందుకు వదులుకున్నానని నిహారిక బాధపడుతుంది.

‘కలర్ ఫొటో’ సినిమాలో హీరోయిన్‌గా ముందుకు నిహారికను అనుకున్నారట. కానీ కరోనా సమయంలో రిస్క్ చేయడం సరికాదని నిహారిక నో చెప్పిందట. దీంతో చాందిని చౌదరిని సినిమా యూనిట్ ఎంపిక చేసింది. ఈ సినిమాలో చాందిని చౌదరి నటనకు మంచి మార్కులే పడ్డాయి. హీరోయిన్‌గా ఇప్పటివరకు అంతగా విజయాలు అందుకోని చాందిని.. ఈ సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది.

అయితే త్వరలో జోన్నలగడ్డ చైతన్యను నిహారిక లవ్ మ్యారేజ్ చేసుకోనున్న విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ ప్యాలెస్‌తో వీరి పెళ్లి జరగనుండగా.. బంధువులు, సన్నిహితులు మాత్రమే ఇందులో పాల్గొననున్నారు