వీడియో వైరల్: భర్త మాటలు విని వెక్కి వెక్కి ఏడ్చిన నిహారిక

మెగా డాటర్ నిహారిక పెళ్లి పూర్తై నెల రోజులు గడిచినా.. ఇంకా దాని గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా తన పెళ్లికి సంబంధించిన ఒక వీడియోను నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆరు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో తన భర్త జోన్నలగడ్డ చైతన్య ఇచ్చిన ఒక సందేశం విని నిహారిక వెక్కి వెక్కి ఏడ్చింది. నిహారిక పెళ్లి కుమార్తెగా రెడీ అవుతున్న సమయంలో చైతన్య ఒక వడియో సందేశం పంపాడు.

niharika emotional chaitanya video

‘డియర్ నిహా.. మూడు ముళ్ల బంధంతో మన ప్రయాణాన్ని మొదలుపెడుతున్న ఈ సమయంలో నీతో ఓ విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నా. నీతో గడిపిన ప్రతి క్షణాన్ని నా తుదిశ్వాస వరకూ గుర్తుపెట్టుకుంటాను. 30 ఏళ్లుగా నేను ఏం కోల్పోయానో నిన్ను కలిసిన తర్వాత అర్థమైంది. అలాగే నేను నీ కోసమే పుట్టానని.. నా జీవితానికి అర్థం నువ్వేనని కూడా తెలిసింది’ అని చైతన్య అందులో చెప్పాడు. ఈ మాటల విన్న నిహారిక భావేద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సందర్భంగా చిరంజీవి కూతురు సుస్మిత ఓదార్చింది. నిహారిక షేర్ చేయడంతో.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.