సెక్సీ పోజ్‌తో సెగలు రేపుతున్న ఇస్మార్ట్ బ్యూటీ

టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కొద్దిరోజుల్లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది బెంగళూరు భామ నిధి అగర్వాల్. టాలీవుడ్‌లో కేవలం మూడు సినిమాల్లో నటించిన తన నటనతో మంచి పేరు సంపాదించుకుంది. డాన్సర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన నిధి అగర్వాల్.. 2017లో మున్నా మైఖెల్ అనే సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగులో సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం తమిళంలో పలు సినిమాల్లో ఈ బ్యూటీ నటిస్తోంది.

nidi agarwal

అయితే ఇన్‌స్టాలో ఎప్పుడూ ఏదోక ఫొటోను నిధి అగర్వాల్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారును రెచ్చగొడుతూ ఉంటుంది. తాజాగా సెక్సీ పోజ్‌లో ఇన్‌స్టాలో ఈ భామ పెట్టిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఈ ఫొటోలో సెక్సీ పోజ్‌లో క్యూట్‌గా నవ్వుతూ కనిపించింది. ప్రస్తుతం తెలుగులో ఈ భామకు అవకాశాలు రావడం లేదు. దీంతో అవకాశాలు దక్కేలా చేసుకునేందుకు ఇలా సెక్సీ ఫొటోలు పోస్ట్ చేస్తూ రెచ్చగొడుతుందని అంటున్నారు.

ప్రస్తుతం తమిళంలో భూమి అనే సినిమాలో ఈ అమ్మడు నటించగా.. త్వరలో ఇది థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఇటీవలే ఈశ్వరన్ అనే తమిళ సినిమాలో నటించేందుకు ఆమె ఓకే చెప్పగా.. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్‌లో రానున్న మరో సినిమాలో కూడా కీలక పాత్రలో నటించేందుకు రెడీ అయింది.