పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో జోరు మీద ఉన్నారు. వకీల్ సాబ్‌, అయ్యప్పనుమ్ కోషియమ్ తెలుగు రీమేక్‌తో పాటు క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో ఒక పిరియాడిక్ సినిమాలో పవన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనేది ఇంకా కన్ఫామ్ కాలేదు.

nidhi agarwal opposite pawan

తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటించనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలోనే మరో హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించనుందని తెలుస్తోంది. త్వరలో దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రానుందని సమాచారం. కాగా గతంలో ఇస్మార్ట్ శంకర్‌తో పాటు సవ్యసాచి సినిమాల్లో నిధి అగర్వాల్ నటించింది.