చక్కనమ్మ చీర కట్టినా అందమే…

నిధి అగర్వాల్, టైగర్ ష్రాఫ్ సినిమాతో బాలీవుడ్ తెరపై మెరిసిన ఈ బ్యూటీ… 2018లో అక్కినేని నాగ చైతన్య సినిమాతో తెలుగు తెరపై మెరిసింది. సవ్యసాచి సినిమాతో డీసెంట్ ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్, ఫస్ట్ మూవీతో గ్లామర్ గా కనిపించి యూత్ ని ఆకట్టుకుంది. స్వతహాగా మంచి డాన్సర్ అయిన నిధి, సవ్యసాచిలో మంచి డాన్స్ మూవ్స్ కూడా వేసింది. ఈ మూవీ అయిపోగానే మరో అక్కినేని కుర్రాడు అఖిల్ సినిమాలో కూడా మెరిసింది. అన్నతో సవ్యసాచిలో నటించిన నిధి, తమ్ముడిని మజ్ఞుని చేసింది. మజ్ను సినిమాలో నిఖిత పాత్రలో కనిపించిన నిధి అగర్వాల్ ఈసారి యాక్టింగ్ స్కిల్స్ తో మెప్పించింది. మొదటి రెండు సినిమాలే అక్కినేని ఫ్యామిలీ హీరోలతో నటించడంతో అమ్మడి కెరీర్ టర్న్ అయిపోతుందని అంతా అనుకున్నారు కానీ నిధి కెరీర్ లో పెద్దగా మార్పులు ఏమీ జరగలేదు.

ఇక తెలుగులో పని అయిపొయింది అనుకుంటున్న టైములో పూరి చేతిలో పడిన నిధి, ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించింది. సైంటిస్ట్ గా కనిపించిన నిధి, మాస్ ఆడియన్స్ కి కావాల్సిన గ్లామర్ షో చేయడంలో ఏమాత్రం ఆలోచించని నిధిని చూసిన మాస్ ఆడియన్స్ థియేటర్స్ లో విజిల్స్ వేశారు. కథక్ డ్యాన్స్.. బెల్లీ డ్యాన్స్ లో దిట్ట అయిన నిధి రీసెంట్ గా సైమా అవార్డ్స్‌ ఈవెంట్‌లో కూడా డాన్స్‌ పర్‌ఫామెన్స్‌తో అదరగొట్టేసింది. ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ అయిపోవడంతో నిధి అగర్వాల్, హాటు భామగా గుర్తింపు తెచ్చుకుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ అయినా కూడా అవకాశాలు రాకపోవడంతో నిధి మళ్లీ తన గ్లామర్ నే నమ్ముకుంటూ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ ఫాలోవెర్స్ ని అట్రాక్ట్ చేస్తోంది. రీసెంట్ గా సారీలో ఉన్న ఫోటోలని పోస్ట్ చేసిన నిధి, తనలో అందం నిధే దాగుందని ప్రూవ్ చేసింది. మరి ఈ గ్లామర్ షో అయినా నిధి అగర్వాల్ కి అవకాశాలు తెచ్చి పెడుతుందేమో చూడాలి.