ఘట్టమనేని హీరో పక్కన ఛాన్స్ కొట్టేసిన పూరి హీరోయిన్

nidhhiagerwal

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి కొత్తగా రెడి అయిన కుర్రాడు అశోక్ గల్లా. రీసెంట్ గా అనౌన్స్ అయిన ఈ మూవీ నవంబర్ 10న గ్రాండ్ లాంచ్ జరగనుంది. రామానాయుడు స్టుడియోస్ లో జరగనున్న ఈ ఓపెనింగ్ ఫంక్షన్ కు టాలీవుడ్ ప్రముఖులు రానున్నారు. శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ హీరోయిన్ ని ఫైనల్ చేశారు.

ashok galla debut movie

అక్కినేని హీరోలతో రెండు సినిమాలు చేసి,రీసెంట్ గా ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ అందుకున్న నిధి అగర్వాల్ ఈ మూవీలో హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది.అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నరేశ్‌, సత్య, అర్చనా సౌందర్య ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.