`ఇస్మార్ శంకర్` సాంగ్ చిత్రీకరణలో నిధి అగర్వాల్

Nidhhi Agerwal from ‘iSmart Shankar’ Song Shoot

ఎనర్జిటిల్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం `ఇస్మార్ట్ శంకర్`. `డబుల్ దిమాక్` ట్యాగ్ లైన్. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సమ్మర్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన భారీ సెట్లో `దిమాక్ ఖరాబ్… ` అనే సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. వందమంది డ్యాన్సర్స్ తో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తోన్న ఈ సాంగ్ ను కాసర్లశ్యామ్ రాశారు. ఈ సాంగ్ తెలంగాణ యాసలో సాగుతుంది. ఈ సాంగ్ లో నిధి అగర్వాల్ స్టిల్ ను విడుదల చేశారు. వైబ్రేంట్ కాస్ట్యూమ్స్ లో ఉన్న నిధి లుక్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది.
ఈ సాంగ్ సెట్ ను డైరెక్టర్ సుకుమార్ విజిట్ చేసి సరికొత్త స్టైల్లో ఉన్న రామ్ లుక్ ను, సాంగ్ మేకింగ్ ను అప్రిషియేట్ చేశారు.
న‌టీన‌టులు:

రామ్
నిధి అగ‌ర్వాల్‌
న‌భా న‌టేష్‌
పునీత్ ఇస్సార్‌
స‌త్య‌దేవ్‌
మిలింద్ గునాజి
ఆశిష్ విద్యార్థి
గెట‌ప్ శ్రీను
సుధాంశు పాండే త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ఫైట్స్‌: రియ‌ల్ స‌తీష్‌
సాహిత్యం: భాస్క‌ర‌భ‌ట్ల‌
ఎడిట‌ర్‌: జునైద్ సిద్ధికీ
ఆర్ట్‌: జానీ షేక్‌
సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌
మ్యూజిక్‌: మ‌ణిశ‌ర్మ‌
నిర్మాత‌లు: పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్‌
ద‌ర్శ‌క‌త్వం: పూరి జ‌గ‌న్నాథ్‌.