జనవరి 10న ”లవ్ స్టోరి” టీజర్ రిలీజ్ !!

ప్లెజంట్ ప్రేమ కథల్ని తనదైన శైలిలో తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల
రూపొందిస్తున్న మరో ఆహ్లాదకర సినిమా ”లవ్ స్టోరి”. ఈ అందమైన ప్రేమ కథలో
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. ఫ్యాన్స్ తో పాటు సినీ
అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.‘‘ఫిదా’’ తర్వాత స్టార్
డైరెక్టర్ శేఖర్ కమ్ముల తీస్తున్న సినిమాకావడం.నాగ చైతన్య,సాయి పల్లవి
లాంటి స్టార్ కాస్టింగ్ ఉండటం ఈ ఎక్స్ పెక్టేషన్స్ కు కారణం.ఇప్పటికే
రిలీజైన ఫస్ట్ లుక్ ,ఏయ్ పిల్లా అనే సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది..
షూటింగ్ అంతా కంప్లీట్ అయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు
చకచకా జరుపుకుంటుంది.

ఇక ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీజర్ అప్ డేట్ రానే
వచ్చింది. జనవరి 10,ఉదయం 10:08 గం.లకు ‘‘లవ్ స్టోరీ’’ టీజర్ రాబోతుంది.ఈ
అనౌన్స్ మెంట్ కు సంబంధించి ఓ లవ్ లీ పోస్టర్ ను వదిలింది టీమ్.ఈ పోస్టర్
లో నాగచైతన్య చెవిలో సాయి పల్లవి ఏదో చెబుతోంది.చూడ ముచ్చటగా ఉన్న ఈ
పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్
సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి.
రామ్మోహన్ రావు నిర్మాతలు. ”లవ్ స్టోరి” చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ
రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు:

సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్

మ్యూజిక్ : పవన్ సి.హెచ్

సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఐర్ల నాగేశ్వర రావు

నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్,పి.రామ్మోహన్ రావు

రచన,దర్శకత్వం: శేఖర్ కమ్ముల.