Tollywood: చ‌క్రి త‌మ్ముడు మ్యూజిక్ అందించిన సాంగ్‌ను రిలీజ్ చేసిన రాంచ‌ర‌ణ్‌..

Tollywood: టాలీవుడ్ నూత‌న హీరో్ ర‌మ‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో.. ఎం ర‌మేశ్‌, గోపీ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం రెడ్డిగారింట్లో రౌడీయిజం. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ కంప్లీట్ చేసుకోగా.. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. కాగా ఈ చిత్రంకు సంబంధించి తొలి సాంగ్‌ను ఇటీవ‌లే వైఎస్ ష‌ర్మిల చేతుల మీదుగా రిలీజ్ చేయ‌గా.. తాజాగా రెండో సాంగ్‌ను మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ రిలీజ్ చేశారు.

Mega powerstar

ఈ సంద‌ర్భంగా చిత్ర‌బృందానికి శుభాకాంక్ష‌లు తెలిపి ఈ సినిమా మంచి విజ‌యం ద‌క్కాల‌ని ఆశిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ చిత్రానికి దివంగ‌త ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ చ‌క్రి త‌మ్ముడు మ‌హిత్ నారాయ‌ణ్ మ్యూజిక్ అందించ‌గా.. చ‌ర‌ణ్ ఆయ‌న‌ను ఆలింగ‌నం చేసుకుని మ‌రీ ఈ సినిమా విజ‌యాన్ని కాంక్షిస్తూ బెస్ట్ విషెస్ తెలిపారు.