అక్టోబర్ 23న విడుదల కానున్న ఎ సూటిబుల్ బాయ్

ఇషాన్ ఖట్టర్ మరియు టబు నటించిన మీరా నాయర్ పరిమిత సిరీస్ ఎ సూటిబుల్ బాయ్ అక్టోబర్ 23న ఇండియన్ ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ సిరీస్ ఇప్పటికే యుకె మరియు ఐర్లాండ్‌లోని బిబిసిలో ప్రసారం చేయబడింది, ఇప్పుడు యుఎస్, యుకె, ఐర్లాండ్, కెనడా మరియు చైనాలను మినహాయించి అక్టోబర్ 23 న ప్రపంచ ప్రేక్షకుల కోసం ప్రసారం కానుంది.

విక్రమ్ సేథ్ నవలలో బెస్ట్ క్లాసిక్ లలో ఒకటైన ఎ సూటిబుల్ బాయ్ కథ ఆధారంగానే దీన్ని తెరకెక్కించారు. 1951 కాలంలో కొనసాగే ఈ కథలో లతా అనే పాత్ర చుట్టూ ఉద్వేగభరితమైన సన్నివేశాలు ఉంటాయి. ఒక సాహిత్య విద్యార్థి తన భర్తను ఎన్నుకోవాలనుకునే తాపత్రయంలో ఆమె జోక్యం చేసుకునే తల్లి యొక్క ప్రయాణాన్ని హైలెట్ చేశారు. ముగ్గురు వేర్వేరు పురుషులు ఆమె హృదయాన్ని గెలవడానికి ప్రయత్నించినప్పుడు, కథ శృంగారం వైపు ఎలా యూ టర్న్ తీసుకుంటుంది. అలాగే ఆమె హృదయ వేదన ఎలా ఉంటుంది అనే అంశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయని టాక్.